ఈ మద్య సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు జీఎస్టీ బాదుడికి గురి అవుతున్న వారే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించి కొత్త సంవత్సరానికి శుభవార్త తెలిపింది.  జీఎస్టీ తగ్గించడంతో నేటి నుంచీ కొన్ని ఉత్పత్తులు తక్కువ రేటుకి లభించబోతున్నాయి. మొత్తం 23 రకాల వస్తు సేవల రేట్లు తగ్గుతున్నాయి. అవేంటో తెలుసుకుంటే, తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు.  ఈ తగ్గింపుతో సామాన్యుడికి అవసరమైన పలు వస్తు సేవల ఖరీదు తగ్గనుంది. పన్ను తగ్గింపుతో సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌బ్యాంకులు, నిల్వచేసిన కూరగాయలు ఇకపై చౌకగా లభిస్తాయి.

Image result for 23 రకాల వస్తు సేవలపై తగ్గిన జీఎస్టీ

పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన జాబితాలో కప్పీలు, ట్రాన్స్‌మిషన్‌ షాఫ్ట్, పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్‌ పవర్‌ బ్యాంకులు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్‌లు, వీడియో గేమ్‌ పరికరాలున్నాయి.  రీ-ట్రేడింగ్ టైర్లు, ట్రాన్స్‌ మిషన్‌ షాఫ్ట్, లిథియం ఆయాన్ పవర్ బ్యాంకులు   నిన్నటివరకూ 28 శాతంగా ఉన్న జీఎస్టీ పన్నును ఇవాళ్టి నుంచీ 18 శాతానికి తగ్గించారు. దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. సరకు రవాణా వాహనాల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.

23 goods and services to get cheaper from January 1 as reduced GST - Sakshi

అత్యల్ప పన్ను శాతమైన 5 శాతం శ్లాబులోఊత కర్ర, ఫ్లైయాష్‌ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లను చేర్చారు. తాజాగా, 5 శాతం శ్లాబులోకి ఊత కర్ర, ఫ్లైయాష్‌ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లు తదితరాలను చేర్చారు. పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం సమకూర్చే చిన్న విమాన సర్వీసులపైనా 5 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు కానుంది. శీతలీకరించిన, ప్యాక్‌ చేసిన కూరగాయలు, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలను కూడా తక్కువ పన్ను శ్లాబ్ లోకి మార్చారు. జన్‌ధన్‌ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలను కూడా పన్ను పరిధి నుంచి తప్పించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: