కొత్త ఏడాది కోటి ఆశలతో వచ్చేసింది. అందరూ అనేకమైన కోరికలు కోరుకుంటున్నారు. మరి వారి ఆశలను ఈ ఏడాది తీరుస్తుందా అన్నది చూడాలి. ముఖ్యంగా  చెప్పుకోవాలంటే 2019 ఎన్నికల ఏడాది. ఈ కొత్త సంవత్సరం ఏపీలో రాజకీయం ఎలా ఉంటుందో, ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఏ తీరుగా సాగుతుందో చూడాలి మరి.


అయిదు నెలలుగా :


ఇక వైసీపీ విషయానికి వస్తే ఉత్తరాంధ్రా జిల్లాల్లో గత అయిదు నెలలుగా జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జగన్ కు జనం బ్రహ్మరధం పడుతున్నారు. ఎక్కడ చూసిన ఇసుకవేస్తే రాలనంతగా జనం కదలి వస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. జగన్ సైతం అందరికీ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇక్కడ ఉన్న 34 అసెంబ్లీ సీట్లు, అయిదు ఎంపీ సీట్లలో జగన్ పార్టీ ఎంత మేరకు విజయం సాధిస్తుందని అంతా చర్చించుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో జగన్ పార్టీ ఇక్కడ కేవలం తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకుని, ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి అవి అయిదు ఎమ్మెల్యేలకే పరిమితమైంది. మిగిలిన వాళ్ళంతా జంపు చేసేశారు. మరి జీవన్మరణ సమస్యగా  ఈ ఎన్నికలను భావించి జగన్ కాలికి బలంపం కట్టుకుని తిరుగుతున్నారు. ఈసారి జగన్ ఆశలు నెరవేరుతాయా. మెజరిటీ సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయా అన్నది చూడాలి.


అభర్ధులే కరవు :


గత సారి కంటే కూడా ఈసారి వైసీపీకి ఒక కీలకమైన  సమస్య బాధిస్తోంది. అదేమంటే సరైన అభ్యర్ధులు ఆయన పార్టీకి లేకుండా పోయారు. గతంలో మెరికల్లాంటి అభ్యర్ధులు అంతటా ఉన్నా, ఊపు ఉన్నా కూడా చేజేతులా చేసుకున్న కొన్ని తప్పిదాల మూలంగా పార్టీ ఓడిపోయింది. తరువాత కాలంలో వారిలో చాలామంది అధికార పార్టీ వైపుగా జారుకున్నారు. మిగిలిన వారు ఉన్నా సైలెంట్ అయ్యారు. ఇక జగన్ సైతం చాలమందిని తప్పించి కొత్తవారిని పెట్టారు. ఓ విధంగా చెప్పాలంటే జగన్ ఎక్కువమందిని కొత్తవారిని దింపడం ద్వారా ఈసారి ప్రయోగం చేయబోతున్నారు. మరి పార్టీని ఆదరించి ఓటు వేస్తే ఫరవలేదు, అభ్యర్ధులను కూడా చూసి ఓటు వేస్తే మాత్రం వైసీపీకి ఇబ్బంది కరమే. అయితే ఎలా చూసుకున్నా ఈసారి విజయభేరీ ముగించి తీరుతామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. చూదాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: