ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశ రాజకీయాల్లోకి వచ్చేందుకు తపిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ లేని కూటమే ఫెడరల్ ఫ్రంట్ అంటున్న కేసీఆర్.. దానికోసం ఓ జాతీయస్థాయి పార్టీని నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలేని కూటమి ఈ దేశంలో సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తక మానదు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమి కట్టాలంటున్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మోదీని కలవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మోదీ కోసమే కేసీఆర్ ఈ కూటమి తెరపైకి తెస్తున్నారనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

 Image result for kcr federal party

బీజేపీ వద్దు.. కాంగ్రెస్ వద్దు.. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఓ పార్టీ పెడదాం.. మనమే ఢిల్లీనీ ఏలుదాం.. అనేది కేసీఆర్ చెప్తున్న మాట. అయితే.. ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమానదూరం అంటూనే.. మరోవైపు కేసీఆర్ ప్రధాని మోదీతో సమావేశం కావడాన్ని ప్రత్యర్ధి పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అసలు ఫెడరల్ ఫ్రంట్ అనే దానికి అర్ధమే లేదని.. ఆ కూటమిలో చేరే పార్టీలు ఏంటదానిపైనే స్పష్టత లేదనే విమర్శలు తీవ్రం అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లేకుండా ఏపార్టీ కూడా అధికారాన్ని సాధించలేదనేది వాస్తవం అంటూ ప్రత్యర్ధి పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

 Image result for kcr federal party

దేశవ్యాప్తంగా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఏకమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీయేతర కూటమికి చంద్రబాబు బీజం వేశారు. జాతీయస్థాయి మహాకూటమిని నిర్మించేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న చంద్రబాబు కూడా.. కేసీఆర్ వ్యూహాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ కూటమి సాధ్యం కాదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట పర్యటనలు చేస్తున్న కేసీఆర్..  ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని, అందుకే వారిపై ఎవరికీ నమ్మకం లేకుండా పోతోందని అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ లేకుండా కూటమి సాధ్యం కాదనేది చంద్రబాబు చెప్తున్న మాట. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ రెండింటిలో ఏదో ఒక పార్టీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడలేదని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు.

 Image result for kcr federal party

మోదీ నియంతృత్వ పాలన సాగిస్తున్నారంటూ.. ఆయనకు వ్యతిరేకందా దేశంలోని పలు పార్టీలు ఏకమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ పార్టీలన్నీ కూటమి కట్టి వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. మోదీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ – టీడీపీలు ఏకమయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సెమీ ఫైనల్స్ లో బీజేపీ తీవ్ర పరాభవం చవిచూసింది. ఇది విపక్షాలకు మరింత ఆయుధంలా మారింది. వచ్చే ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని గ్రహించే కేసీఆర్ మోదీ కోసం ఈ కూటమిని ఏర్పాటు చేసేందుకు ట్రై చేస్తున్నారనేది కేసీఆర్ వ్యతిరేక పార్టీలు చెప్తున్న మాట.

 Image result for kcr federal party

కేసీఆర్ కూటమి వైపు ఎవరు వెళ్తారనేది ఇప్పుడే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన ఇప్పటివరకూ చాలా మంది నేతలను కలిశారు. ఇటీవలే రెండో విడత టూర్ కూడా చేసి వచ్చారు. అయితే ఆయనకు ఏ ఒక్కరి నుంచి కూడా నిర్దిష్టమైన హామీ వచ్చినట్లు కనిపించడం లేదు. యన ప్రపోజల్ పై చూద్దాం.. ఆలోచిద్దాం.. లాంటి మాటలే నేతల నుంచి వచ్చినట్టు సమాచారం. అయితే కేసీఆర్ కూడా  కూటమికి తొందరేం లేదంటున్నారు. తానకొ బృహత్ యజ్ఞాన్ని స్టార్ట్ చేశానని చెప్తున్నారు. ఇందుకు సమయం పడ్తున్నారు. దేశ గతిని మార్చేందుకు ఏర్పాటవుతున్న ఈ కూటమికి కాస్త సమయం పట్టడం మామూలేనన్నారు. మరి ఎన్నికల్లోపు ఆయనతో ఎన్ని పార్టీలు ముందుకొస్తాయో వేచి చూడాలి. ఒకవేళ తెలంగాణ ఉద్యమంలాగే జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని సాధిస్తే మాత్రం కేసీఆర్ విజయం సాధించినట్లే..!


మరింత సమాచారం తెలుసుకోండి: