అఖిల్ ప్రియ అతి  చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టింది. చిన్న పిల్ల తనకేం తెలుసునని అందరూ అనుకున్నారు అయితే ఇప్పడూ ఈమె స్పీచ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అఖిల్ ప్రియా ఏమన్నారంటే ... ప్రత్యర్థి కేడర్ కు నేను చెప్పేది ఒక్కటే. మీరు పని చేయాలనుకుంటే.. మీకు గౌరవం కావాలనుకుంటే మా వద్దకు రండి. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. భూమా కేడర్ ది పెద్ద మనసు.  ఎవరు వచ్చినా వాళ్లను స్వీకరించే మంచి మనసు ఉంది. ఇక్కడ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అవతలి వాళ్లకు కూడా చెబుతున్నా. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా వద్దకు వస్తే - నేను మిమ్మల్ని కూడా చూసుకుంటా.

Image result for akhila priya minister

చాలామంది నా వద్దకు వచ్చి మన వాళ్లకు ఇంకా కసి రావట్లేదని చెబుతున్నారు. కానీ ఆ కసి సమయం వచ్చినప్పుడు వస్తుందని చెప్పా. మా వాళ్లకు అది వస్తే మీరు తట్టుకోలేరని చెప్పా. మనోళ్లకు కసి వస్తే అది సునామీ లెక్క ఉంటుంది.  చాలామంది టెన్షన్ పడుతున్నారు. అలాంటిదేమీ అక్కర్లేదు. ఇక్కడ చాలామంది నా గెలుపుపై మాట్లాడలేదు. నాకొచ్చే మెజార్టీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.నంద్యాల ఉప ఎన్నికల సమయంలోను నేను ఓ సవాల్ చేశా. 


 భూమా బ్రహ్మానంద రెడ్డి గెలవకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పా. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా - భూమా వర్గం నాయకురాలిగా ఉన్న తాను నియోజకవర్గంలో మరొకరితో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. నేను చావనైనా చస్తాను కాని ఒకరి వద్ద తలదించను.  మిమ్మల్ని (తన కేడర్) కూడా తలదించకుండా  చూసుకుంటా.  ఇన్ని రోజులు వర్గం కోసమో , గ్రూప్ కోసమో మీరు త్యాగాలు చేశారు. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో ఎంత నష్టపోయారో ప్రత్యక్షంగా చూశా.  నా తల్లిదండ్రులు కూడా మీ కోసం ఎంతో తపించడం చూశా. అవన్నీ నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని తలదించుకోనియకుండా రాజకీయం చేస్తా.

మరింత సమాచారం తెలుసుకోండి: