ఎవరు గొప్ప? కలవకుంట్ల చంద్రశేఖరరావు గారా? లేక నారా చంద్రబాబు నాయుడు గారా? రెండు తెలుగు రాష్ట్రాల కున్న లోక్-సభ స్థానాలు మొత్తం 42 కాగా ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 25 తెలంగాణాలో 17 ఉన్నాయి. మొత్తం 543  లోక్-సభ స్థానాల దేశంలో కనీసం ఈ  రెండు రాష్ట్రాలు కలిపి పది శాతం స్థానాలు కూడా కంట్రిబ్యూట్ చేయటం లేదు సరికదా!  వీళ్ళిద్దరు ఒకరి నొకరు అసభ్యంగా దూషించుకుంటూ ఉంటారు.


నిజంగా చెప్పాలంటే నూతన రాష్ట్రం తెలంగాణా దాదాపు కొన్ని శతాబ్ధాలుగా అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. స్వాతంత్రం వచ్చిన తరవాతైనా హైదరాబాద్ నగరాన్ని తప్ప తెలంగాణాను  పట్టించుకున్న నాధుడు లేడు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల  పాలనలో గ్రామీణ తెలంగాణా ధారుణ అలక్ష్యానికి గురై వెనకబడింది. ప్రతి రంగం లోను వెనకబాటు తనమే కొట్టొచ్చేట్టు కనబడుతుంది.

kcr bangaru telangana కోసం చిత్ర ఫలితం

సాంస్కృతికంగా, సాహిత్యపరంగా తెలంగాణా నిజంగా ఎంతో ఉన్నతం, కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోక ముందు సినీరంగం అలాగే, వ్యవసాయం, పారిశ్రమలు, విద్యా, ఆరోగ్యం ఇలా ఏది చూసినా వాటి యాజమాన్యాలు అన్నీ ఈ రెండు మూడు జిల్లాల వాళ్ళే స్వంతం చేసుకొంటూ మొత్తం రాష్ట్రం మీద ఆధిపత్యం వహిస్తూ సంపన్నవంతమై పోగా ఆంధ్ర ప్రాంతంలోని  రెండు మూడు జిల్లాలలోని ఒకటి రెండు సామాజిక వర్గాల గుప్పిట్లో ఉండి ఉక్కిరి బిక్కిరైంది. అలాంటి తెలంగాణాలో ప్రజలెన్నుకున్న నాయకత్వం ప్రజలకు ప్రాంతాలకు సమానంగా ఉండేలా అభివృద్దిపరంగా చెయ్యాల్సింది ఎంతో ఉంది. 


అలెగ్జాండర్ భారత ఉపఖండంలో ప్రవేసించే రోజున ఈ దేశం ఎంతగా వణికి ఉంటుందో, అంతకు మించి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తుంటే తెలంగాణా ప్రజలు అంతగా వణికిపోయారన్నది, ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైంది. అసలు టిడిపి ఇక్కడ కాంగ్రెస్ తో కలవకుండా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఉండేదనేది విశ్లేషకుల వాదన.

kcr bangaru telangana కోసం చిత్ర ఫలితం

ముఖ్యంగా తెలంగాణా హైదరాబాద్ సైబరాబాద్ ల అభివృద్ధికి నేనే కారణం అందుకే హైదరాబాద్ తెలంగాణా అంటే నాకెంతో ప్రేమ అనే చంద్రబాబు మాటలకు జన బాహుళ్యం ఎంతగా స్పందించిందంటే నీ రాక్షస ప్రేమ మాకొద్దు బాబోయ్? నువ్వంటేనే మాకు కంపరం బాబోయ్? అన్నంతగా! దూరం పెట్టేశారు  చంద్రబాబుపై ఉన్న తీవ్ర వ్యతిరేఖత, దాంతో మైత్రి నెరపిన కాంగ్రెస్ పై, అసహ్యభావంతో ఇష్టంలేని వాళ్లు కూడా, ముందు ఆత్మరక్షణ ముఖ్య మనుకొని కేసిఆర్ టిఆరెస్ ను అత్యంత అద్భుతః అనేలా గెలిపించేశారు. చంద్రబాబు నుండి అలా ప్రమాదం ఐదేళ్ళ వరకు తప్పిపోయింది.


ఇంతవరకు ఇలా ఉంటే దాన్ని చూసి కేసీఆర్ తనను తాను బాహుబలిగా ఊహించుకొని పార్టీని యువరాజుకు, రాష్ట్ర శాంతి భద్రతలను మహమాత్యులకు ఒప్పగించి తానొక సార్వభౌమునిలా దేశాటన చేసే లగ్జరీలో కేసీఆర్ మునిగిపొయారు. 

kcr vs bangaru telangana కోసం చిత్ర ఫలితం

నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వారు ఆర్ధికంగా విద్యావైద్యాలు, నీటిపారుదలపరంగా అహోరాత్రాలు కష్టించి పనిచేసినా తెలంగాణా ప్రజల్లోని వెనకబాటు తనాన్ని  తొలగించటానికి సరిపోదు. కనీసం ఎమెల్యేల ప్రమాణ స్వీకారం, మంత్రిమండలి ఏర్పాటు మొదలైనవాటిని ముహూర్తాలకు వదిలేయటం క్షమించరాని నేరంగా చెప్పొచ్చు అంతా తెలిసినా కేసీఆర్ గెలుపుకు మూలం తెలంగాణా రాజకీయాల్లో చంద్రబాబు పాదం మోపటం.


గ్రామీణ తెలంగాణా ఈయన చంద్రబాబు ప్రవేశాన్ని పూర్తిగా సహించలేదు. అలాగే పట్టణ, నగర తెలంగాణా కూడా కొంత వరకు సహించలేదు. అదే కేసీఆర్ గెలుపుకు దారితీసింది. ఈ వాపును బలుపని అనుకుంటున్నారు కేసీఆర్.  అందుకే తీర్ధయాత్రలు, దేశయాత్రలు,  జైత్రయాత్రలు మానేసి కొత్త సంవత్సరంలోనైనా బంగారు తెలంగణా లక్ష్యం ఇంకా నెరవేరే వరకైనా రాష్ట్రంపై శ్రద్ద పెట్టటం మంచిది. దేశానికి ఫెడరల్ ఫ్రంట్ అవసరమేమాత్రం లేదు. ఉన్నవాళ్ళు పనిచెస్తే సరి అంటున్నారు తెలంగాణా వాసులు. కేసీఆర్ రెచ్చిపోకుండా ఉంటే అంతా పదిలం. లేకుంటె అంతా గందరగోళం. 

మరింత సమాచారం తెలుసుకోండి: