ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌ గా పావులు కదులుతున్నట్టుగా కనిపిస్తోంది. ఓవైపు ఓటుకు నోటు కేసు భయం కొనసాగుతుండగానే ఇప్పుడు మరో కేసు తెర మీదకు వచ్చింది. ఓటుకు నోటు కేసులో ఏం పీక్కుంటారో పీక్కోండి అనే స్థాయిలో ఏపీ మంత్రులు సవాలు విసురుతున్న నేపథ్యంలో ఈ కొత్త కేసు తెరపైకి రావడం ఆసక్తిరేపుతోందిఇంతకీ ఈ కొత్త కేసు ఏమిటంటారా.. ఇది కొత్త కేసే అయినా కొత్త విషయమేమీ కాదు.

సంబంధిత చిత్రం

గతంలో బాగా ప్రత్యర్థుల నోళ్లలో నానిన ఆరోపణే. కాకపోతే అది ఇప్పుడు కేసు రూపం దాలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. 2004 నాటి కేసును తిరగదోడాలని న్యాయవాది ఇమ్మనేని రామారావు అనే న్యాయవాది కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత్ అనే సంస్థకు కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారన్నది ఆరోపణ.

chandrababu img bharat billy rao కోసం చిత్ర ఫలితం


ఐఎంజీ భరత్ విషయంలో చంద్రబాబుపై, కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీకి ఆ లాయర్ ఫిర్యాదు చేశారుఆపద్ధర్మ సీఎంగా ఉండి.. కాగితాలకే పరిమితమైన ఐఎంజీ కంపెనీకి 850 ఎకరాలు కారుచౌకగా ఇచ్చారని కంప్లయింట్ చేశారు. కుట్ర, మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి కోణాల్లో కేసును పరిశీలించాలని ఆ ఫిర్యాదులో కోరారు.



ఓవైపు నోటుకు ఓటు కేసులో కేసీఆర్ సర్కారు పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కేసు క్రమంగా నీరుకారిపోతోందన్న భావన ఉంది. మరోవైపు హైకోర్టు కూడా విడిపోయిన సమయంలో ఈ ఐఎంజీ కేసు ఎంతవరకూ చంద్రబాబును ఇబ్బంది పెడుతుందన్నది పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: