మనం ఏం అనుకుంటే అదే కళ్ళముందు కనిపిస్తుంది. ఒకటికి పదిమార్లు ఎవరిని తలచుకుంటే వారే ఎక్కడ చూసినా ఉన్నట్లుగా అనిపిస్తారు. నిజానికి మిత్రుడుగా ఉంటే  ఎవరి  పేరు పెద్దగా తలచుకోం. అదే శత్రువుగా ఉంటే మాత్రం ఇలలోనూ కలలోనూ వారే అగుపిస్తారు. కలవరింతలు, పలవరింతలు కూడా వారే అవుతారు. 


ఎటుచూసినా ఆయనే :


ఇక విషయానికి వస్తే ఏపీ రాజకీయాల్లో ఎటు చూసినా ఇపుడు చంద్రబాబునాయుడుకు నరేంద్రమోడీ కనిపిస్తున్నారు. చిత్రమేమిటంటే ఒక్క మోడీ కాదు. ప్రతి వారిలోనూ  ఆయనకు మోడీ కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా చంద్రబాబుకు కేసీయార్ లోనూ, జగన్ లోనూ కూడ మోడీ కనిపిస్తున్నారట. కేసేయార్ జూనియర్ మోడీగా, జగన్ మినీ మోడీగా కళ్ళ ముందే కదలాడుతున్నారు. అదేం భాగ్యమో కానీ ఎవరికీ ఇంతలా కనిపించని మోడీ బాబు గారికి మాత్రం కళ్ళు మూసినా తెరచినా కనిపించి కనువిందు చేస్తున్నారు.


మోడీ ఫోబియా :


బాబుకు చాలాకాలంగా మోడీ ఫోబియా పట్టుకుంది. మోడీ ప్రస్తాన లేకుండా ఆయన ఏ మాటా మాట్లాడలేని స్థితిలో పడ్డారు. అది మీడియా మీటింగ్ అయినా, పబ్లిక్ ఫంక్షన్ అయినా, అధికారుల సమావేశమైనా మోడీ జపం బాబు బాగా చేస్తున్నారు. తనకంటే జూనియర్ అయిన మోడీని ఇంతలా జపించడమే అసలైన విశేషం. ఇక దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మోడీకి బాబు గురించి ఆలోచిందే ఓపిక, తీరిక ఉంటుందా అన్నది డౌట్. 
పైగా ఒక్క ఏపీ కోసం కుట్రలు చేయాల్సిన అవసరం ఉంటుందా అన్నది కూడా అలోచించాలి. విశాఖ ఉత్సవ్ లో ఎయిర్ షో కు అనుమతి ఇవ్వలేదని మోడీని బాబు తప్పుపట్టారు. అధికారుల స్థాయిలో జరిగే పనులు, పొరపాట్లకు కూడా మోడీవే బాధ్యుడన్నట్లుగా బాబు వైఖరి ఉంది. ఇంక ఎన్నికలు దగ్గరపడితే ఈ మోడీ నామ జపం మరెంతగా పీక్స్ కి వెళ్ళిపోతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: