అందుకే ముందస్తుగా ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. రానున్న ఎన్నికల్లో అసలు టిక్కెట్టు వస్తుందో రాదో ? వచ్చిన గెలుస్తారో లేదో కూడా తెలీదు. కానీ ప్రచారం మాత్రం మొదలుపెట్టేశారు. పోయిన ఎన్నికల్లోనే అతికష్టం మీద తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం నుండి నిమ్మకాయల చినరాజప్ప గెలిచారు. ఏదో అదృష్టం కలసివచ్చి ఏకంగా ఉప ముఖ్యమంత్రే అయిపోయారు. హోమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జిల్లాలో ముఖ్య నేతలతో వివాదాలు మొదలయ్యాయి. పోయిన ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గాన్ని ఖాళీ చేసిన బొడ్డు భాస్కర రామారావుతో వైరం బాగా పెరిగిపోయింది. దానికితోడు చుట్టుపక్కలున్న కాకినాడ, రాజమండ్రి నియోజకవర్గాల ఎంఎల్ఏలతో ఏమాత్రం పడటం లేదు.

 

ఈ నేపధ్యంలోనే నిమ్మకాయల ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశారు పెద్దాపురంలో. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తం మీద ఎవరు కూడా ప్రచారాన్ని ఇంకా మొదలుపెట్టలేదు.  తన గురువు కంచి మహాసంస్ధాన అధ్యక్షుడు చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్త్రి ఇంట్లోనే పూజలు చేసిన హో మంత్రి గురువు ఆశీస్సులు తీసుకుని ప్రచార రథాన్ని ముందుకు దూకించారు. గురువు ముందుగా తూర్పుదిక్కుగా ప్రచారం మొదలు పెట్టమని చెప్పటంతో అదే విధంగా ప్రచారం మొదలుపెట్టారు.

 

ప్రచార రథంలో గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ, ఆలయ కమిటి ఛైర్మన్ కంటే జగదీష్ లాంటి నేతలతో ప్రచారం మొదలుపెట్టారు. సరే, ప్రచారం మొదలుపెట్టటం వరకూ బాగానే ఉంది కానీ పార్టీలోనే తన వ్యతిరేకులను ఎలా దారికి తెచ్చుకుంటారన్నదే పెద్ద సమస్యగా మారింది. పార్టీలోని చాలామంది ప్రత్యర్ధులు నిమ్మకాయల ఓటిమికి కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నిమ్మకాయలను గెలిపించే ప్రశక్తే లేదని స్పష్టంగా చెబుతున్నారు. అదే విషయాన్ని హోంమంత్రి కూడా నిర్ధారించారు. వచ్చే ఎన్నికల్లో తన ఓటిమికి పార్టీలోని తన శతృవులు చాలామందే ప్రయత్నిస్తున్నట్లు బహిరంగంగానే చెప్పారు. అంటే హోంమంత్రి గెలుపుకన్నా ఓటమికి ప్రయత్నాలు చేసే వాళ్ళే ఎక్కువన్న విషయం తెలిసిపోతోంది. అందుకే ముందస్తు ప్రచారం మొదలుపెట్టేశారేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: