2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో అసలు ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి.. మీడియా అండతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చా.. ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న పత్రికలు ఎన్నికల్లో ఏమేరకు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. వీటన్నింటినీ మించి ఓటర్లను ఆలోచింపజేసేలా కొత్త మీడియా ఆవిర్భవించిందా.. ఓసారి పరిశీలిద్దాం..

social media icons కోసం చిత్ర ఫలితం


ప్రభుత్వాల పనితీరును, లోటుపాట్లను ప్రజలకు చేరేవేసే ప్రధాన సాధనం మీడియా. ఈ మీడియాను తెలివిగా ఉపయోగించుకున్న నాయకులు రాజకీయాల్లో బాగా రాణిస్తారంటారు. అందుకు ఏపీ సీఎం చంద్రబాబును ఉదాహరణగా చెబుతుంటారు. తెలుగు మీడియా హౌజుల్లో ప్రధానమైనవి, ప్రభావితం చేసేవీ ఎక్కువగా తెలుగుదేశం కొమ్ముకాసేవే అన్న సంగతి జగమెరిగిన సత్యమే.

tdp social media కోసం చిత్ర ఫలితం


అసలు ఆ కారణం వల్లనే అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన కొడుకుతో సాక్షి మీడియాను పెట్టించారన్న సంగతీ తెలిసిందే. ఇప్పుడు తెలుగు మీడియాలో టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌లకు.. కొంతవరకూ జనసేనకూ సొంత మీడియాలు ఉన్నాయి. ఐతే.. వీటన్నిటినీ మించి ఇప్పుడు మరో మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. అదే సోషల్ మీడియా. ప్రధాన మీడియాలు చాలావరకూ దాచిపెట్టే.. చెప్పడానికి సంకోచించే విషయాలను కూడా సోషల్ మీడియా ప్రపంచానికి వెల్లడిచేస్తోంది.

సంబంధిత చిత్రం


ఫేస్‌బుక్, ట్విట్టర్‌, వాట్సప్‌.. ఇలా ప్రతి ఒక్కరి చేతికి అందివచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు విశ్వరూపం చూపిస్తోంది. అనేక రకాల పక్షపాతాలున్న ప్రధాన మీడియాను మించి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విశ్లేషణను ప్రపంచానికి చాటొచ్చు. తమ భావాలను అందరితో పంచుకోవచ్చు. దీనికితోడు.. ప్రధాన మీడియా అంతా కొందరి చేతుల్లో కేంద్రీకృతమై.. నిర్ణీత ప్రదేశాల్లో, నిర్ణీత సమయాల్లోనూ వెలువడే అవకాశం ఉంది. కానీ సోషల్ మీడియా 24 గంటలూ అందుబాటులో ఉండి.. సమాచార, భావ మార్పిడిని ఊహించనంత వేగవంతం చేసింది.

సంబంధిత చిత్రం


అందుకే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా సొంతంగా సోషల్ మీడియా వింగులను ఏర్పాటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గమనిస్తూ.. వాటిని ఖండించడమో.. తమ వాదన వినిపించడమో.. లేదా ప్రోత్సహించడమో చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ లైవ్‌లు, వాట్సప్‌ ల ద్వారా ఇప్పుడు ప్రతి నాయకుడూ అందరికీ చేరువవుతున్నాడు2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ టీమ్ ఈ సోషల్ మీడియాను వాడుకునే విపరీతంగా జనంలోకి దూసుకెళ్లింది. సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించిన కమలదళం దాన్ని బాగా వాడుకుంది.

bjp social media కోసం చిత్ర ఫలితం


ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించి తగిన చర్యలు చేపట్టింది. ఇటీవల మూడు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ జయకేతనం వెనుక సోషల్ మీడియాలో ఆ పార్టీ దూకుడుగా ఉండటమూ ఓ కారణమే. ఇక తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం, వైసీపీ, టీఆర్‌ఎస్‌, జనసేన వంటి పార్టీలు సోషల్‌ మీడియా ప్రచారంపై ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నాయి. సోషల్‌ మీడియా కారణంగా జరిగిన మహోపకారం ఏమిటంటే.. ప్రధాన మీడియా దాచాలని ప్రయత్నించిన అనేక అంశాలు ఈ సోషల్ మీడియా వల్ల వెలుగులోకి వస్తున్నాయి.

congress social media కోసం చిత్ర ఫలితం


చివరకు ప్రధాన మీడియా సోషల్‌ మీడియాను అనుసరించాల్సిన దుస్థితి దాపురించిందంటూ ఇటీవల ఓ దమ్మున్నపత్రిక సంపాదకుడు తన సంపాదకీయంలో రాసుకోవాల్సి వచ్చింది. ప్రధాన మీడియా అధిపతులకూ కొన్ని పరిమితులు ఉంటాయి. అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకిస్తూ ధైర్యంగా ముందడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి క్లిష్ట సమయాల్లో సోషల్ మీడియా అలాంటి విషయాలను ధైర్యంగా బహిరంగ పరుస్తుంది. ఇప్పుడు కొన్నిపత్రికలనో, ఛానళ్లనో అదుపులో పెట్టుకుంటే చాలనే పరిస్థితి లేదు.

telangana social media కోసం చిత్ర ఫలితం


ఒకప్పుడు పత్రికలు ఏది చెబితే అదే వాస్తవమని జనం నమ్మేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా రాకతో ఆ దుస్థితి తప్పింది. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి మాధ్యమాల్లో అనేక అంశాలపై హాట్ హాట్ చర్చలు జరుగుతుంటాయి. వీటి ద్వారా అనేక వాదనలు తెరపైకి వస్తాయి. సమాజంలోని అన్నివర్గాల భావాలు వెలుగుచూస్తాయి. వీటి ద్వారా ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతోంది.

jagan pawan social media కోసం చిత్ర ఫలితం


ఐతే.. సోషల్ మీడియా ద్వారా అన్నీ ఉపయోగాలేనా ఇబ్బందులు లేవా.. లోపాలు లేవా అనే సందేహమూ తలెత్తుతుంది. దుష్ప్రచారం అనేది సోషల్ మీడియాలోని ఓ ప్రధాన లోపం. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, విశ్లేషణలకు విశ్వసనీయత చాలా తక్కువ. తమకు తోచని విధంగా విశ్లేషణ రాసి.. దాన్ని ఓ ప్రముఖ పత్రిక చెప్పిందనో.. ఓ ప్రముఖ సర్వే చెప్పిందనో ప్రచారం చేసే అవకాశాలు చాలా ఎక్కువ.

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే చెప్పింది ఇదే అంటూ కొన్నివందల సర్వేలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. తప్పుడు వార్తలు, కావాలని చేసే తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియాలో చాలా అవకాశం ఉంది. ఐతే.. సోషల్ మీడియా చేసే మేలుతో పొలిస్తే.. కీడు కాస్త తక్కువే.


మరింత సమాచారం తెలుసుకోండి: