కొత్త సంవత్సరం తొలిరోజునే ఇంటర్వ్యూ రూపంలో మోదీ ప్రజల ముందుకు వచ్చారు. జిఎస్టీ, పెద్దనోట్ల రద్ధు,  రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, రఫేల్‌పై ఆరోపణల  సర్జికల్‌ స్ట్రైక్స్‌, రుణమాఫీ నుంచి శబరిమల, ట్రిపుల్‌ తలాక్‌, ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా దాకా పలు అంశాలపై మాట్లాడారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం తన దృష్టికి రాలేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కూటమి ఏర్పాటు గురించి ఇప్పటివరకు తాను ఆలోచించలేదు అన్నారు. జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటు కూడా తనను గద్దె దించడం కోసమే తప్ప దేశం కోసం కాదన్నారు. ప్రజలు, మహాకూటమి మధ్యే 2019 ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 


మంగళవారం ఆయన ఏఎన్‌ఐ ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ, "త్రిపుర, కశ్మీర్‌ లోనూ మహాకూటమికి ఘోర పరాభవం ఎదురైంది. తెలంగాణ లో మహాకూటమిని ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది ఎవరో వచ్చే ఎన్నికలు చెబుతాయి.  ఇప్పుడు భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా, ఒకప్పుడు కాంగ్రెస్‌ను కాదన్న వాళ్లే.  ఇప్పుడు కాంగ్రెస్‌ లో చేరుతున్న వాళ్లను ఆ పార్టీ బలిపశువులను చేస్తోంది. 


కేంద్ర సర్కారు పనితీరుపై విపక్షాలన్నీ ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నా ప్రజలు ఉన్నది మాత్రం తమవైపేనని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. తమ సర్కారు అధికారం లోకి వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం కల్పించేవేనని ఆయన పేర్కొన్నారు. నల్లధనం వెనక్కి రప్పించడం, వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమలు వంటి విషయాల్లో తాము కచ్చితంగా విజయం సాధించామని, ఏ రకంగా చూసినా వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించేది తమకేనని ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత చిత్రం
తెలంగాణ, మిజోరంలలో భాజపా అధికారంలోకి వస్తుందని భాజపాతో సహా ఎవ్వరూ చెప్పలేదు. కనీసం అలాంటి ఊహ కూడా ఎవ్వరూ చేయలేదు. మిగతా మూడు రాష్ట్రాల విషయానికొస్తే ఛత్తీస్‌గడ్‌లో భాజపా ఓడిపోయింది. మిగిలిన రెండు రాష్ట్రాల్లో హంగ్‌ ఏర్పడింది. మాలో ఉన్న లోపాల గురించి చర్చించుకుంటున్నాం. వాటిని అధిగమించ డానికి ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నాం.


దక్షిణ భారతంలో భాజపా లేదనడం అసత్య ప్రచారం. కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో అధికారం లోకి వచ్చాం. దేశం నలువైపులా భాజపా విస్తరించి ఉంది. ప్రాంతీయ ఆకాంక్షలకు విలువ ఇవ్వడం, కలిసి సాగడం మా సిద్ధాంతం. 
narendra modi to ANI interview కోసం చిత్ర ఫలితం
ఏడాది క్రితమే మేం స్వచ్ఛంద వెల్లడి పథకం పెట్టి మీ దగ్గర నల్ల ధనం ఏమైనా ఉంటే జమచేయండన్నాం ఆతరవాతే నోట్లు రద్దు ప్రకటించాం. రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేయ లేదు. పెద్దనోట్ల రద్దుతో పెద్దల ఇళ్లలో పరుపుల కింద, సంచుల్లో ఉండి పోయిన నోట్లన్నీ నేడు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రావటం శుభ పరిణామం కాదా! అన్నారు. మన దేశంలో నల్ల ధనం గురించి ఎన్నో ఏళ్ల నుంచి చర్చలు నడుస్తున్నాయి. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందన్న విషయాన్ని ఎవ్వరూ కాదన లేరు.


పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద అధికారుల ఇళ్లలో పరుపుల కింద నోట్లు దొరుకుతూ ఉండేవి. సంచుల్లో నిండిన నోట్లు దొరికేవి. సమాంతర ఆర్థిక వ్యవస్థ మన దేశాన్ని నాశనం చేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశం భవిష్యత్తులో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారనుంది. సంచుల్లో నిండిన నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయి. దీనివల్ల ఇప్పుడు జవాబుదారీతనం వచ్చింది. పన్ను పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య పెరిగింది. దీని గురించి ఏమంటారు? ఇది మా విజయమంటారా? కాదా? ఇది మంచి పరిణామమా? కాదా? జీడీపీతో పోలిస్తే నగదు తగ్గుతూ పోతోంది. ఇది శుభసంకేతం. జిఎస్టీ కి ముంది వస్తువు సేవలపై 30-40% పన్నురేట్లుకు మించి సామాన్యుడికి తెలియని రహస్యపన్నులూ ఉండేవి. అవన్నీ జిఎస్టీతో సరైపోతున్నాయి.


నీరవ్‌ మోదీ, మాల్యా పారిపోయారుగా? అన్నదానికి మేం చట్టాలు కఠినతరం చేయబట్టే ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాంగ్రెస్ గనక అధికారంలో ఉండిఉంటే వాళ్లు దేశం లోనే భయంలేకుండా భరోసాగా జీవించే వాళ్లు. మేం కచ్చితంగా వాళ్లను భారత్ కు రప్పిస్తాం అన్నారు. 
narendra modi to ANI interview కోసం చిత్ర ఫలితం
2013-14 లోనూ ఒక రాజకీయ వర్గం మనుషులు నరేంద్ర మోదీ ప్రభంజనం లేదని ప్రచారం చేశారు. ఇప్పుడు వారే తాము పనిచేస్తున్న వ్యక్తులకోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు మామీద ఉన్నాయి. అవే సరికొత్త వాతావరణం, ఉత్సాహాన్ని నెలకొల్పుతున్నాయి. సర్వేల ద్వారా 180 సీట్లలో కూడా బిజెపికి విజయావకాశాలు కష్టమే నన్నదానికి మోదీ - వాళ్లు ఇలాంటి లెక్కలు చెప్పకపోతే వారి కూటమి లో పార్టీలు ఎలా చేరతాయి? తమను తాము రక్షించు కోవడానికి ఇలాంటి మాటలు చెబుతూ పోతున్నారు. 2019 లో సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి దూరం జరుగుతారని ఎలా అంచనా వేస్తారు? సామాన్యుడికి ఈ విషయాలన్నీ తెలుసు. నాకు ఈ దేశ  ప్రజల మీద, యువత మీద చాలా విశ్వాసం ఉంది.


విదేశీ పర్యటనలు ఫోటోకోసమే అన్న విమర్శలకు బదులిస్తూ ప్రతి ప్రధాన మంత్రి పర్యటనా దాదాపు ఇంతేస్థాయిలో ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయ  వేదికలు చాలా అయ్యాయి. అందువల్ల వాటికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కంటే కిందిస్థాయి వ్యక్తులు వెళ్తే ఆ వేదికలపై గొంతు వినిపించే అవకాశం ఇవ్వరని అన్నారు 


రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం పై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు. కేబినెట్‌ నిర్ణయాలను రాహుల్‌ గాంధీ మీడియా సమావేశంలో చించివేశారు. రఫేల్‌పై ఆరోపణల గురించి పార్లమెంట్‌ లోనే సమాధానం చెప్పాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం రక్షణ ఒప్పందాల పైనే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? రక్షణ ఒప్పందా లపై ఆరోపణలు చేస్తూ, సైన్యం స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు. సైన్యానికి కావాల్సిన ఆయుధాల కొనుగోలు విషయంలో వెనకడుగు వేసేది లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: