ప్రపంచ ప్రసిద్ది చెందిన శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలోకిమహిళలు ప్రవేశించాలా, వద్దా అనే విషయంపై  గత కొంత కాలంగా ఎన్నో చర్చలు సాగుతూ వస్తున్నాయి.  శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రాజ్యాంగ నైతికత ఆధారంగా పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో మహిళలు స్వామి వారి దర్శనం చేసుకోవొచ్చు అన్న తీర్మాణం కూడా వెలుబుచ్చింది.  అయితే ఈ తీర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో వివాదాలు అయ్యప్ప స్వామి ఆలయం చుట్టూ కొనసాగుతున్నాయి. 

Image result for అయ్యప్ప స్వామి మహిళలు

ఇప్పటికే పలువురు మహిళలు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించగా భక్తులు, అక్కడి పూజారులు పూర్తిగా వ్యతిరేకించారు.  ఆలయంలో అయ్యప్ప దర్శనం కోసం వస్తున్న మహిళలను ఆందోళనకారులు అడ్డుకుంటుండడంతో పంబ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు.  శబరిమల ఆలయంలో మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, కేరళలో ఒక వర్గం మాత్రం ఆ తీర్పు అమలయ్యే దారిలో ఒక అడ్డు గోడ కట్టినట్టు కనిపిస్తోంది. కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి కేరళా సర్కార్ మహిళలకు స్వామి వారి దర్శనం చేయిస్తామని పంతం పట్టింది. 

Image result for ayyappa temple womens

తాజాగా కేరళ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంది. శబరిమలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయ్యప్ప దేవాలయానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు ఈ తెల్లవారుజామున స్వామిని దర్శించుకున్నారు. కాగా, మండల పూజలు ముగిసి, మకరవిళక్కు పూజల కోసం స్వామి ఆలయాన్ని తెరచిన వేళ, మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఇంకా సమయం ఉండగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, పోలీసులు భారీ భద్రత మధ్య 40లోపు వయసున్న ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం చేయించారు. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: