తెలంగాణలో మహా కూటమి ఘోర పరాజయం ఏపీ సీఎం చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అవే ఫలితాలు ఏపీలోనూ రిపీటవుతాయోమోన్న భయం టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. అందుకే ఇటీవలి కాలంలో చంద్రబాబు రూటు మార్చేస్తున్నారు. మరోసారి టీడీపీని గెలిపించకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు.



తాజాగా టీడీపీ జన్మభూమి-మా వూరు’ కార్యక్రమం చేపట్టబోతోంది. ఈ కార్యక్రమం సందర్భంగా 10రోజులు గ్రామాలు,వార్డుల్లోనే ఉండాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఇది ఎన్నికల ఏడాది, చాలా కీలకమైన సమయం కాబట్టి.. టీడీపీని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇస్తున్నారు.



ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు ఈ ఎన్నికలపైనే ఆధారపడి వుందంటున్నారు చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ గెలవాలి... రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ఇదీ ఆయన కొత్త నినాదం. దుష్టశక్తులు పార్టీపై, రాష్ట్రంపై కక్ష కట్టాయని పరోక్షంగా వైసీపీ, బీజేపీలను విమర్శిస్తున్నారు.



మళ్లీ టీడీపీ రాకపోతే రాష్ట్రం దెబ్బతింటుందనే వాదనతో చంద్రబాబు ఓటర్లను బ్లాక్‌ మెయిల్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. కేసుల మాఫీ కోసమే జగన్ కు అధికారం కావాలని.. అందుకే మోది, కేసీఆర్‌లతో జగన్ జట్టుకట్టాడని విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసినవారితో జగన్ జతకట్టాడనే వాదనను జనంలోకి తీసుకెళ్తున్నారు. మరి ఈ బ్లాక్‌మెయిల్ అస్త్రం ఏమేరకు పనిచేస్తుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: