మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డే గొప్పోడంటూ కితాబిచ్చారు, వైఎస్ కు  ఉండవల్లి  అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి ఉండవల్లి కూడా తండ్రి వైఎస్ కన్నా కొడుకు జగనే గొప్పోడని ఎందుకు అన్నారు ? ఎందుకంటే, జనాలను ఉద్దేశించి మాట్లాడటంలో వైఎస్ కన్నా జగనే బాగా మాట్లాడుతున్నట్లు చెప్పారు. జనాలకు చెప్పదలుచుకున్నది చెప్పటంలో జగన్ స్పష్టంగా ఉన్నారని చెప్పారు. తాను చేయబోయేదేమిటి ? చంద్రబాబు చేస్తున్నదేమిటి ? అనే విషయాలను చెప్పటంతో జగన్ బాగా సక్సెస్ అయ్యారని కితాబిచ్చారు.

 

అదే సమయంలో చంద్రబాబు గురించి మాట్లాడుతూ, తాను చేపదలుచుకున్నారో ఆ విషయాన్ని చెప్పటంలో చంద్రబాబు ఎప్పుడూ కన్ఫ్యూజన్లోనే ఉంటారన్నారు. చంద్రబాబుకు వాట్ ఐ మీన్ టు సే అని అనటంతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి పాదయాత్ర చేసింది వైఎస్సే అన్నారు. ఆరోజు పాదయాత్ర చేయటం వైఎస్ కు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. పాదయాత్ర వల్లే వైఎస్ తిరుగులేని నేతగా ఎదిగి తర్వాత ముఖ్యమంత్రయ్యారని చెప్పారు. తర్వాత పాదయాత్ర చేసిన చంద్రబాబు పార్టీని బతికించుకోవటానికి మాత్రమే చేసినట్లు తెలిపారు. ఇపుడు జగన్ చేస్తున్న పాదయాత్రలో జనాలు బ్రహ్మరథం పడుతున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే అంటూ ముగించారు.

 

చంద్రబాబును తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. ఓటమి తప్పదని తెలిసి కూడా చివరి నిముషం వరకూ  గెలుపుకోసం ప్రయత్నించటం చంద్రబాబు నైజమన్నారు. చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోడిని తిట్టటం వల్ల ఏమీ ఉపయోగం లేదని గ్రహించాలని సలహా ఇచ్చారు. ఏపిలో బిజెపి ఫోర్సు కానపుడు మోడిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారో అర్దం కావటం లేదన్నారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలు పెద్ద బోగస్ గా తీసిపడేశారు. విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఏ ఒక్కటి కూడా వాస్తవానికి దగ్గరగా లేదన్నారు. శ్వేతపత్రాలపై తాను చర్చకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఎవరైనా చర్చకు టిడిపిలో రెడీగా ఉంటే తాను అమరావతికి వస్తానని చాలెంజ్ చేశారు. పొత్తుల విషయాన్ని మాట్లాడుతూ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో పవన్ కల్యాణే చెప్పాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: