తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్‌ మీట్ పెట్టి మరీ ఏపీ సీఎం చంద్రబాబును కడిగిపారేయడం.. అందుకు పాయింట్ టు పాయింట్ చంద్రబాబు కౌంటర్ ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. హైకోర్టు వివాదం, ప్రత్యేక హోదా, హైదరాబాద్ ఐటీ క్రెడిట్, ఏపీకి కేంద్రం అన్యాయం వంటి అనేక విషయాలపై ఇద్దరూ ఓ రేంజ్‌లో మాటల యుద్ధం కొనసాగించారు. ఈ ఇద్దరు చంద్రుల యుద్దాన్ని మీడియా, సోషల్ మీడియా కూడా ఆసక్తిగా గమనించిందిఇంతకీ ఈ ఇద్దరు చంద్రుల్లో ఎవరు చెప్పేది నిజం.. ఇద్దరి వాదనల్లో వాస్తవాలేంటి.. ఎవరి వాదన కరెక్టు.. ఎంతవరకూ కరెక్టు.. ఈ విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం..



హైకోర్టు విభజన అంశం

హైకోర్టును హడావిడిగా విభజిస్తున్నారు.. కనీసం నెల రోజులు కూడా సమయం ఇవ్వడం లేదన్నది చంద్రబాబు వాదన. అంతేకాదు.. హైకోర్టును హడావిడిగా విభజించడంలో ఆయన రాజకీయ కోణాన్ని కూడా చూశారు. అనేక సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న జగన్‌కు మేలు చేసేందుకే ఇప్పుడు హడావిడిగా హైకోర్టును విభజిస్తున్నారేమో అన్నఅనుమానం కలుగుతోంది అని విమర్శించారు. ఐతే.. హైకోర్టు విభజన ప్రక్రియలో కేంద్రం పాత్ర ఏమీ లేదని కేసీఆర్ చెబుతున్నారు. డిసెంబర్ నాటికి ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేసుకుంటామని ఏపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిందని.. దాని ప్రకారమే కేంద్రం నోటిఫై చేసిందని చెబుతున్నారు.

Image result for ap high court


హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పింది అక్షరాలా సత్యం. ఎందుకంటే.. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచే సాధ్యమైనంత త్వరగా రెండు హైకోర్టులు పని చేయాల్సిఉంది. కానీ ఏపీ నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే హైకోర్టు విభజన ఆలస్యమైంది. కేవలం భవనాల నిర్మాణమే ఆలస్యానికి కారణమైతే.. ప్రస్తుత హైకోర్టు భవనంలోనే రెండు హైకోర్టులు ఉండొచ్చని తెలంగాణ చెప్పింది. లేదంటే హైదరాబాద్ లోనే వేరే భవనాలు ఇస్తామని కూడా చెప్పింది. మరీ కాదంటే మేమే వేరే భవనంలో హైకోర్టు ఏర్పాటు చేసుకుంటాం. మీరు ప్రస్తుత భవనంలోనే కోర్టు కొనసాగించుకోండి. కొత్త భవనాలు కట్టుకునే వరకూ అని కూడా ఆఫర్ ఇచ్చింది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. చివరకు డిసెంబర్ నాటికి హైకోర్టు భవనాలు సిద్ధం చేసుకుంటామని ఏపీ సర్కారే సుప్రీంకోర్టుకు చెప్పింది. కాబట్టి హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సీఎం చెప్పిందే నిజం. ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు విభజనను కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకునేందుకే ప్రయత్నించారని భావించవచ్చు.

Image result for ap special status

ప్రత్యేక హోదా :

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ వాదనే సబబు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీనే అన్నిరకాలా మేలు అని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్నారు. హోదా కోసం పోరాడితే జైలులో పెడాతమని అన్న మాటలు తెలుగుదేశం కార్యకర్తలు మర్చిపోవచ్చేమో కానీ.. ఏపీ జనం మరచిపోరు. అంతెందుకు.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు నరేంద్రమోడీ సర్కారును అభినందిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది.

Related image


ఐతే.. ప్రత్యేక ప్యాకేజీని కూడా సరిగ్గా అమలు చేయడం లేదని.. అందుకే తాము మళ్లీ ప్రత్యేక హోదా కోరుతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్రం వాదన మరోలా ఉంది. ప్రత్యేక ప్యాకేజీ అమలు కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసుకోవాలని తాము కోరినా ఏపీ స్పందించడం లేదని కేంద్రం చెబుతోంది. ఏది ఏమైనా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట మారుస్తూ విశ్వసనీయత కోల్పోయారు.

Related image

ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్‌ వైఖరి..

తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఏపీలో వైసీపీ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు కొత్తవాదన ఎత్తుకున్నారు. ప్రత్యేక హోదాను అడ్డుకునే కేసీఆర్ గెలిస్తే.. వైసీపీ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. పదే పదే అనేక వేదికలపై వైసీపీ,టీఆర్‌ఎస్ దొందూదొందే అనేలా కామెంట్స్ చేశారు. ఈ వాదనను కేసీఆర్ తన ప్రెస్ మీట్‌ లో తిప్పికొట్టారు. తాము ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు. తమ పార్టీ పార్లమెంట్‌ వేదికపై ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరామన్నారు. అవసరమైతే తాను కేంద్రానికి లేఖ రాస్తానన్నారు.

Image result for ap special status


ఈ అంశంలో కేసీఆర్ చెప్పింది సగం వరకే నిజం. ఏపీకి ప్రత్యేక హోదాను టీఆర్‌ఎస్‌ మొదటి నుంచీ వ్యతిరేకించలేదు. కేసీఆర్ చెప్పినట్టు పార్లమెంట్‌ సహా అనేక వేదికలపై సపోర్ట్ చేశారు కూడా. కానీ మేడ్చల్ సభలో సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడాన్ని టీఆర్ఎస్ నేతలంతా తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతాయన్నారు. హరీశ్ రావు సహా పలువురు నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించారు.

Image result for ap it chandrababu hitech city


హైదరాబాద్ ఐటీ అభివృద్ధి

హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి విషయంలోనూ కేసీఆర్ చెప్పింది చాలా వరకూ అసత్యం. ఉమ్మడి ఏపీలో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు పీకిందేమీ లేదని వ్యాఖ్యానించడం పూర్తిగా అసత్యం. ఐతే.. కేసీఆర్ చెప్పినట్టు సైబర్ టవర్స్‌కు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కానీ.. ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ కు వచ్చేందుకు చంద్రబాబు చేసిన కృషిని ఏమాత్రం విస్మరించలేము. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేసీఆర్ కొడుకు కేటీఆరే ఈ విషయాన్ని ఓ వేదికపై అంగీకిరించిన సంగతి మరిచిపోలేం. ఐతే.. చంద్రబాబుకు చేసిన దాన్ని ఎక్కువ చేసి చెప్పుకునే అలవాటు వల్ల వ్యతిరేకత మూటగట్టుకున్నారు.

Related image


ఏపీకి కేంద్రం సాయం

ఏపీని కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటోందని.. ఈ విషయంలో చంద్రబాబు తప్పులు చెబుతున్నాడని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడం ఏమాత్రం సరికాదు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందో లేదో అనే విషయం కంటే.. ఇస్తామన్నవి.. చేస్తామన్నవి పూర్తిగా చేయలేదన్నది వాస్తవం. తిరుపతి సభలో మోడీ ఏపీని అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పి.. అమలులో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కళ్లముందు కనిపిస్తున్నదే. మరో విషయం ఏమిటంటే.. ఏపీకి కేంద్రం సాయంపై కేసీఆర్ మాట్లాడి అనవసరంగా విమర్శల పాలయ్యారు. అది పూర్తిగా కేంద్రం- ఏపికి సంబంధించిన విషయం. ఇక్కడే మోడీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం ద్వారా కేసీఆర్ ఓవర్ యాక్షన్ చేశారు.

Image result for chandrababu vs kcr

మరింత సమాచారం తెలుసుకోండి: