జనసేన పవన్ కల్యాణ్ డైనమిక్స్ పాలిటిక్స్ లో తగినంత వేగం చూపించడం లేదు. ఓ ఏడాది క్రితం వరకూ పవన్ కల్యాణ్ పై చంద్రబాబు తొత్తు అన్న ముద్ర ఉంది. చంద్రబాబు అండ్ కో పై ధిక్కారం ప్రకటించి సొంత కుంపటి బాగా రాజేసుకుందామని ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నాల్లో తడబాటు కనిపిస్తోంది.

Image result for pawan kalyan


తాజాగా పవన్ కల్యాణ్‌ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే జగన్‌కు వచ్చిన నష్టమేంటి అని చంద్రబాబు చేసిన కామెంట్స్ రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. మరోసారి జనసేన టీడీపీతో చేతులు కలుపుతోందన్న సంకేతాలు వెళ్తున్నాయి. కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన పవన్ కల్యాణ్ మాత్రం పెదవి విప్పడం లేదు.

Image result for pawan kalyan with chandrababu


ఐతే.. తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని జనసేన అదికార ప్రతినిది పార్దసారది తాజాగా ప్రకటించారు. ఆయన ఒక టీవీ చర్చలో తమ పార్టీ ఎపిలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకూ పోటీ చేస్తుందన్నారు. వాస్తవానికి అంత క్లారిటీ ఉంటే.. సాక్షాత్తూ పవన్ కల్యాణే ఆ విషయం ప్రకటిస్తే బావుండేది. కానీ పవన్ కల్యాణ్ త్వరలోనే దీనిపై స్పందిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Image result for pawan kalyan vs jagan


కానీ ఈలోపు జనసేన పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జనసేన టీడీపీతో కలసి వెళ్తుందని జరుగుతున్న ప్రచారాన్ని సగటు ఓటరు నమ్మే ప్రమాదం ఉంది. పార్టీ పరిస్థితి అసలే అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనైనా పవన్ కల్యాణ్ చురుగ్గా వ్యవహరించకపోతే.. రాజకీయంగా ఇబ్బందుల్లో పడక తప్పదు. వేగంగా స్పందించాల్సిన చోట నిర్లక్ష్యం వహిస్తే.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: