ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఐదు నుండి పదిగంటల పాటు విభిన్న టెలివిజన్ చానళ్ళలో సందడి చేస్తుంటారు. వెదికలపై, శాసనసభలో, వీడిఓ కాంఫరెన్సుల్లో, ధర్మ పోరాట దీక్షలని, న్యాయ పోరాట దీక్షలనీ, నవ నిర్మాణ దీక్షలనీ చేసే కార్యక్రమాల ద్వారా జరిగే అభివృద్దేమిటి? చివరకు అవన్నీ అయిపోగా ఇప్పుడు టీడీపీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ల తన పాలనపై శ్వేత పత్రాలను విడుదల చేశారు. రోజుకో శ్వేతపత్రం చొప్పున నిన్నటిదాకా పది శ్వేతపత్రాలను తన మద్దతు మీడియాలోకి ప్రచారంలోకి వదిలిన చంద్రబాబు. శ్వేత పత్రాల విడుదల కార్యక్రమానికి ప్రస్తుతం శుభం పలికారు. 
undavalli on white papers issued by AP కోసం చిత్ర ఫలితం
అయితే ఈ శ్వేతపత్రాల విడుదల సందర్భంగా వరుస వరుసలుగా మీడియా సమావేశాలు పెట్టిన ముఖ్యమంత్రి తమ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్రం కళకళలాడుతోందని దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించనంత అభివృద్ధి ఏపీలో సాకారమైందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఈ విషయాలు వెల్లడించిన వేదికల మీద నుంచే రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిపక్షం వైసీపీతో పాటు జనసేన ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేఖ కుట్రలలో తమ వంతు పాత్రను  పోషించాయని కూడా చెప్పారు. 
undavalli on white papers issued by AP కోసం చిత్ర ఫలితం
ఈ కుట్రల కారణంగా రాష్ట్రం ఇంకా ఇబ్బందులు పడుతోందని, అభివృద్ధి కుంటుపడుతుందని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒక వైపు తమ పాలన కారణంగానే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధించిందని చెబుతూనే, మరో వైపు రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం ఒక ప్రక్క రాష్ట్రంలోని ప్రతిపక్షాలైన వైసిపి, జనసే, బిజేపిలు మరోప్రక్క అడ్డుకుంటున్నాయని చెప్పుకోవడం - అంటే రెండు వివాదాస్పద విషయాలను ఒకే ఒరలో ఇమిడ్చి చెప్పటం ఒక్క నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే చెల్లిందని  విశ్లేషణకులు చెపుతున్నారు. ఇదంతా చూస్తుంటే మోకాలుకి బోడిగుండుకు లంకె పెట్టటం లాగే ఉందని - చంద్రబాబు మాటల్లో ఏమాత్రం స్పష్టత లేదనిఅంటున్నారు.  undavalli on white papers issued by AP కోసం చిత్ర ఫలితం
అయితే అసలు విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాల విడుదల కార్యక్రమం ముంగింపు పలికే వరకు వేచి చూసిన సీనియర్ రాజకీయవేత్త మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ - విడుదల కార్యక్రమం ముగిసిన మరునాడే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు పై ఆయన విడుదల చేసిన శ్వేతపత్రాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
undavalli on white papers issued by AP కోసం చిత్ర ఫలితం
రావడం రావడమే రంగంలోకి దిగి - శ్వేతపత్రాల్లోని అంశాలు, చంద్రబాబు కేంద్రంపై చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ ఉండవల్లి "అసలు ఈ రెండింటి మధ్య లింకు ఎక్కడుందని మంచి లాజిక్ తీశారు. ఒకవైపు వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నామని చెబుతున్న బాబు, శ్వేతపత్రాల్లో అంకెలగారడీ చేశారని ఆరోపించారు. అయితే అదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రం లోని విపక్షాల ఉమ్మడి కుట్రల కారణంగా అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. అలాంట ప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ప్రగతి బాటన ఎలా నడిపగలిగారో కూడా చెబితే బాగుంటుందని ఉండవల్లి దాదాపుగా చంద్రబాబును శ్వెతపత్రాల కథా కమామిష్ ను ఉతికి ఆరేశారు. 
undavalli on white papers issued by AP కోసం చిత్ర ఫలితం
ఆత్మ స్థుతి అంటే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుని, చంకలు గుద్దుకోవటానికే చంద్రబాబు సర్కారు శ్వేతపత్రాల విడుదలకు చేశారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబు, జనాన్ని చంద్రమాయలో ముంచేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఉండవల్లి ప్రత్యక్ష విమర్శలు చేశారు.  శ్వేతపత్రాల్లోని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనా? అని కూడా ఉండవల్లి సవాల్ విసిరారు. ఒకవేళ చర్చకు సిద్ధమైతే తాను అమరావతికి వచ్చి పదిరోజుల పాటు అక్కడే ఉండి రోజుకో శ్వేతపత్రం పైన చర్చించటానికి సముఖతను ప్రదర్శిస్తూ ఏపిలో పెను సంచలనం రేపారు. చర్చలో భాగంగా శ్వేతపత్రాల్లోని అంశాలు నిజమేనని ప్రభుత్వం ఋజువు చేయగలిగితే, అక్కడికక్కడే తన తప్పును ఒప్పుకోవడంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వానికి బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెబుతానని కూడా ఉండవల్లి సమరానికి సంసిద్ధమేనని సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ కు చంద్రబాబు బృందం నుండి ఎలాంటి స్పందన వస్తుందో? లేక తోక ముడిచేసి కూర్చుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: