తెలంగాణలో గత నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి..ఈ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయ దుందిభి మోగించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమితులు అయ్యారు.  మొన్న జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలవడంతో రెండవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమితులు అయ్యారు. గతంలో టీఆర్ఎస్ లోకి పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

ఈసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది..ఈ నేపథ్యంలో పలువురు టీకాంగ్రెస్, టీడిపి నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లీస్ట్ లోకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా చేరిపోయారు.  త్వరలో అజారుద్దీన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చకుంటున్నారని.. సికింద్రాబాద్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నారని, ఈ మేరకు రంగం సిద్ధమైందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కాంగ్రెస్‌కు ఇది పెద్ద షాకేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి.  ఈ నేపథ్యంలో తను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై అజారుద్దీన్ స్పందించారు.

తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని ఆయన తేల్చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి హాజరైన అజారుద్దీన్ టీఆర్ఎస్‌లో చేరికపై చర్చించినట్టు పుకార్లు షికారు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అజర్‌కు పచ్చజెండా ఊపినట్టు వార్తలు వచ్చాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ పుకార్లకు అజారుద్దీన్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌ను మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: