ఇప్పటివరకు మోడీ మరియు బీజేపీ మీద చంద్ర బాబు , టీడీపీ విమర్శలు చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీ చంద్ర బాబు మీద విమర్శనా బాణాలు సంధిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటం తో మోడీ ఇలా ఎటాక్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. మోడీ ట్విట్టర్ లో ఏమన్నాడంటే, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు... కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న వైనాన్ని తూర్పారబట్టారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టీడీపీని స్థాపించారని గుర్తు చేసిన మోదీ... నాడు టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ గా అభివర్ణించే వారని గుర్తు చేశారు.

Image result for modi vs chandrababu naidu

అయితే తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు... టీడీపీకి దుష్ట కాంగ్రెస్ గా ఉన్న పార్టీతోనే టీడీపీకి పొత్తు కుదిర్చారని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ అన్న టీడీపీ... ఇప్పుడు అదే పార్టీని దోస్త్ కాంగ్రెస్ గా వ్యవహరించాల్సి వస్తోందని కూడా ఆయన తనదైన శైలిలో సెటైర్లు గుప్పించారు. టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీల కుటిల యత్నాలు - వ్యూహాలు ప్రజలకు తెలుసునని కూడా ఆయన చురకలంటించారు.

Image result for modi vs chandrababu naidu

గడచిన నాలుగైదేళ్ల పనితీరును పరిశీలిస్తే... ఏపీ అభ్యున్నతి బీజేపీకి మాత్రమే సాధ్యమని - ఏపీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయగల సత్తా ఒక్క బీజేపీకే ఉందని కూడా ఆయన చెప్పారు.అంతకు కాస్తంత ముందుగా చంద్రబాబు వైఖరిపై తనదైన శైలి విమర్శలు సంధించిన మోదీ... తమ స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అసత్యాలను ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. టీడీపీ అవాస్తవాలపై ఎప్పటికైనా బీజేపీ నిజాయితీనే విజయం సాధిస్తుందని కూడా మోదీ చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: