ఏపీలో మరి కొద్ది నెలల్లో జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. దీనికి సంబంధించి కార్యాచరణను కూడా సిధ్ధం చేసుకుంటున్నాయి. ఏపీలో పోటీ ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉండడం, బాబు సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకుడు కావడం, పైగా మోడీని చాలెంజ్ చేసి మరీ జాతీయ స్థాయిలో కూటమి కట్టడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీ ఎన్నికలు జాతీయంగా పెద్ద ప్రభావమే చూపిస్తాయనడంలో సందేహం లేదు.


అవినీతి అనకొండ:


ఏపీలో ఎన్నికల అజెండాను తనకు అనుకూలంగా సెట్ చేసేందుకు టీడీపీ తొమ్మిది నెలల క్రితమే స్కెచ్ గీసిపెట్టుకుంది. ఏపీలో అభివ్రుధ్ధి ఏదైన జరిగితే తన పుణ్యం, ఏ ఒక్కటీ అమలు కాకపోయినా కేంద్రంలోని మోడీదే పాపం అన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తూ అలుపెరగని ధర్మ పోరాటాలను టీడీపీ చేపడుతున్న సంగతి విధితమే. ఈ నేపధ్యంలోనే ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు తీర్చలేదని చంద్రబాబు ప్రతీ రోజు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఆ విధంగా బీజేపీని దోషిగా చూపించి ఎన్నికల గోదారిని సానుభూతితో ఈదేయాలన్నది బాబు మార్క్ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే ఇపుడు ఏపీలో మరో ఎన్నికల అజెండా రెడీగా ఉండి. అదే అవినీతి.


అన్నింటా అదే సీన్ :


ఏపీలో అవినీతి గురించి ఇపుడు అంతా చెప్పుకునే పరిస్థితి ఉంది. అన్నా క్యాంటీన్ల నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకూ అన్నింటా అదే విశ్వరూపంతో దర్శనమిస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఏది చేపట్టినా, మరేది తలపెట్టినా కూడా అందులో అవినీతి ఏరులై పారుతోంది. నిధులను దుర్వినియోగం చేయడం, దారి మళ్ళించడం ఈ ప్రభుత్వంలో పరిపాటిగా మారిదన్న కామెంట్స్ వస్తున్నాయి. గ్రామ స్థాయిలో జనాలకు ఈ అవినీతి కంపు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో జన్మ భూమి కమిటీలు అవినీతి పేరిట చేస్తున్న విలయ తాండవం టీడీపీ పుట్టెను నిండా ముంచబోతున్నాయని అంటున్నారు.


అవే సూటి ప్రశ్నలు :


ఏపీలో జరుగుతున్న అవినీతి దేశంలో ఎక్కడా లేదని, ఇంతకు ముండు కూడా చూడలేని సీనియర్ పొలిటీషియన్ వుండవల్లి అరుణ్ కుమార్  అన్నారు. ప్రతీ దాంట్లోనూ కమిషన్లూ, వాటాలతోనే ఈ సర్కార్ ని నడిపిస్తున్నారని ఆయన ఘాటైన విమర్శలే చేశారు. ఇక ఏపీ బీజేపీ క్యాడర్ తో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా మాట్లాడిన ప్రధాని మోడీ సైతం ఏపీలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని ద్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పధకాల‌కు కలుపుకుని ఇరవై వేల కోట్ల రూపాయలను విడుదల చేసిందని,, అవి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని సాక్షాత్తూ ఓ ప్రధాని ఏపీసర్కార్ ని నిలదీయడం అన్నది చిన్న విషయం కాదు.


ఇక ఏపీలో అవినీతిపై జగన్ తన సభల్లో పదునైన విమర్శలే చేస్తున్నారు. వామపక్షాలు ఐతే అవినీతినే అజెండాగా చేసుకున్నాయి. అంతెందుకు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీయార్ సైతం ఏపీలో అదుపు లేని అవినీతి జరుగుతోందని అన్నారు. ఇలా మొత్తం దేశం చూపు ఇపుడు ఏపీపైన ఉంది. అవినీతి లో నంబర్ వన్ స్టేట్ అని కూడా పలు సర్వేలు కూడా చెబుతున్న వేళ ఎన్నికల నాటికి ఇదే ప్రధాన అంశమై టీడీపీకి చుక్కలు చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి హోదా, హామీలు అంటూ జనాన్ని వేరే రూట్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్న టీడీపీ వ్యూహకర్తలకు తమ సర్కార్ అవినీతి పై జనం తీర్పు చెపాలనుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: