ప్రజా సమస్యలు తెలుసుకునే దిశగా, పాదయాత్రను చేపట్టి దాదాపు ఏడాదికిపైగా ప్రజల్లో ఉంటూ 335 రోజుల పాటు నడిచిన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో  వైసీపీ వినూత్న ప్రచారానికి తెరతీసింది. ప్రజల్లో చంద్రబాబు నాయుడును డీగ్రేడ్ చేసేందుకు వైఎస్ జగన్ కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నేటి నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు ‘నిన్ను నమ్మం బాబు’ పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
Image result for నిన్ను నమ్మం బాబు
ఈమేరకు కొందరు పార్టీ నేతలు తమ వాహనాలపై ‘నిన్ను నమ్మం బాబు’ స్లోగన్ ముద్రించుకుని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. త్వరలో ఈ స్లోగన్ ఎత్తైన హోర్డింగ్స్ మీద కూడ దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి వైకాపా శ్రేణులు. 14 నెలల క్రితం ప్రారంభమైన వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ నెల 9తో ముగియనుంది.
ysrcp launches 5-day campaign to highlight cm chandrababu naidu's failures
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును నమ్మొద్దంటూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించింది. గతంలో ‘బ్రింగ్ బాబు బ్యాక్’, ‘బాబు రావాలి జాబు రావాలి’ వంటి నినాదాలతో టీడీపీ దూసుకుపోయింది. ఇదే తరహాలో తాజాగా ‘నిన్ను నమ్మం బాబు’ నినాదంతో వైసీపీ జనంలోకి వెళ్తోంది. చంద్రబాబును నమ్మొద్దంటూ క్షేత్ర స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: