ఆంధ్ర ప్రదేశ్ లో 2019 ఎన్నికలు కోసం ఇటు అధికార పార్టీ అటు ప్రతి పక్ష పార్టీ పోటా పోటీగా తలపడుతున్నారు. అయితే ఇప్పటికే తెలుగు దేశం బీజేపీ , జనసేన పార్టీ లతో పొత్తు పెట్టుకొని బయటికి వచ్చేసింది. ఇప్పడూ చంద్ర బాబు కాంగ్రెస్ తో కూడా పొత్తు కు సిద్ధంగా ఉన్నాడు. అయితే జగన్ మాత్రం అప్పటికి ఇప్పటికి ఒంటరిగానే భరిలోకి దిగుతామని చెబుతున్నాడు. ప్రజాసంకల్ప యాత్రలో బిజీగా వున్న వైఎస్‌ జగన్‌, ఈ యాత్రతో జనం మనసుల్ని గెల్చుకున్నాననే ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు.

Image result for jagan padayatra

2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారం దక్కించుకోలేకపోయామనే భావనతో వున్న వైసీపీ, అప్పటికీ ఇప్పటికీ వైసీపీ బలం తగ్గలేదనీ, నాయకులు పోయినా.. పార్టీ క్యాడర్‌ పట్టుదలతో వుందనీ, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం అలాగే వుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. 'చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారు.. పవన్‌కళ్యాణ్‌తో మళ్ళీ స్నేహం కోసం ఎదురుచూస్తున్నారు.. కుదిరితే, ఇంకోసారి బీజేపీతో చెట్టాపట్టాలేసుకు తిరిగేందుకు చంద్రబాబు సిద్ధం.. మా పార్టీ మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళుతుంది..' అంటూ వైఎస్సార్సీపీ తమ నిర్ణయాన్ని కుండబద్దలుగొట్టేస్తోంది.

Image result for jagan padayatra

వైఎస్‌ జగన్‌, కాంగ్రెస్‌ని వీడింది ప్రత్యేక పరిస్థితుల్లోనే. అప్పటినుంచి ఇప్పటిదాకా ఏనాడూ ఆయన కాంగ్రెస్‌ వైపు తిరిగి కన్నెత్తి చూడలేదు. బీజేపీతో సంబంధాల కోసం వెంపర్లాడలేదు. పవన్‌తో అయినా, మరొకరితో అయినా.. స్నేహం విషయంలో వైఎస్‌ జగన్‌ ఆలోచనల్లో మార్పులేదు. ఒకటే లక్ష్యం.. ఒకటే ఆలోచన.. అందుకే, వైఎస్‌ జగన్‌ని రాజకీయాల్లో 'వన్‌ అండ్‌ ఓన్లీ' అని చెప్పక తప్పదు. గెలుపోటముల సంగతి పక్కన పెడితే, మాట మీద ఖచ్చితత్వంతో వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: