కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏం చేసైనా ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు పూర్తిగా తేట తెల్లం అవుతుంది. మనదేశ రక్షణ వ్యవస్థను సమస్య ల్లోకి నెట్టైనా భారత ప్రధాని కావాలన్న ఆయన ఆకాంక్షను జాతి సామూహికంగా ఎదిరించవలసిన సమయం.  చైనా తన వ్యూహంలో భాగంగా పాకిస్తాన్ కోసం యుద్ధనౌకల ను సైతం నిర్మించి సరపరా చేయనున్నతరుణంలో రాహుల్ గాంధి దేశ రక్షణను ఫణంగా పెట్టి రాఫేల్ అంటూ అందులో ఏదో జరిగిందంటూ పార్లమెంటు లో "డాక్టర్డ్ టేపులు" ప్రదర్శిస్తూ అరాచకం ప్రదర్శించటం క్షమించరాని నేరం. 
rahul gandhi is not willing to authenticate Tapes as requested by speaker కోసం చిత్ర ఫలితం
అంతేకాదు ప్రదర్శించిన టేపులను ధృవీకరించమని స్పీకర్ కోరినప్పుడు సిగ్గులేకుండా నోరు మూసుకోవటం భారత జాతికి ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు దాపురించ టాన్ని జాతి గమనించ వల్సిన అవసరం ఉంది.  
rahul gandhi is not willing to authenticate Tapes కోసం చిత్ర ఫలితం
రాహుల్ అండ్ కో అసహ్యకర విమర్శ ఏమంటే ఏఎనై పాత్రికేయురాలు స్మితా ప్రకాష్ – ప్రధాని సమాదానాలకు ఆమె ప్రశ్నలు తయారు చేశారన్నారు. ఇంత నీచ నిమ్న స్థాయికి రాహుల్ దిగజారటం రేపటి మహాగట్భంధన్ కు పెద్ద అపకీర్తిగా మిగలవచ్చు.
Ex-Congress Legislator Vishwajeet Rane Set To Become Minister In BJP-led Goa Government
గతంలో అనేక రక్షణ రంగ స్కాముల్లో ఇరుక్కున్న ఈ కాంగ్రెస్ అధినేత వంశ పరంపర – వరసగా ఈ ప్రతిపక్షనేత కుటుంబ చరిత్ర మొత్తం దేశానికి తెలిసిందే. దేశంలో అనేక అరాచకాలకు తెరలేపిన అత్యవసర పరిస్థితికి కారణమైన నియంతల కుటుంబం వారు నరెంద్ర మోడీని నియంత అనటం – అలాగే నేడు దొంగే ఎదుటివాళ్లను చూపి దొంగ అని అరుస్తుంటే జాతి ఇంకా క్షమించటం బహుశ దేశానికి గాని కాంగ్రెస్ కు గాని మంచిది కాదు. 
doctored tapes in parlament not authenticated by rahul కోసం చిత్ర ఫలితం
అరాచకవాదంతో, గోవా మంత్రి విశ్వజిత్ రాణాను ఈ మాలఫైడ్, టెక్చర్డ్, ఫేక్ , డాక్టర్డ్ టేపులతో ఇబ్బందులకు అపకీర్తికి  గురిచేస్తూ అలజడి చేసే రాహుల్ గాంధి అరాచకం ఆ కుటుంబానికి మిగిలి ఉన్న ఆ కాస్త హుందాతనాన్ని సైతం ఆవిరి చేయటం ఇందులో ప్రస్పుటంగా కనిపిస్తుండగా విలువైన శాసనసభను కౌరవసభగా మార్చటానికి ప్రయత్నిస్తున్న వేళ తగిన చర్యలు తీసుకోవటం అవసరం ఎంతైనా ఉంది. 

doctored tapes in parlament not authenticated by rahul కోసం చిత్ర ఫలితం

ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఒక వారానికి సరిపడా కూడా ఆయుధాగారంలో ఆయుధ సంపత్తి లేని సమయంలో ఆయుధ సమీకరణ దేశానికి చాలా అవసరం. అలాంటప్పుడే ప్రపంచ దేశాలను ప్రధాని సందర్శించి, సమకూర్చిన ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ సంస్థ "ఫైటర్ జెట్స్" సరపరాకు అంగీకరించటం మన దేశానికి ఎంతో శ్రేయోదాయకం. అనేక స్కాముల సూత్రధారుల వంశాంకురం కుశ్చిత కుతంత్రాలతో హుందాతనం మరచిపోయి కన్నుగొట్టే స్థాయికి ప్రధానిని సైతం ప్రొటోకాల్ మరచి హగ్ చేసుకొనే దిగజారిన  రాహుల్ గాంధి, స్వర్గీయ ఎన్టీఆర్ భాషలో చెప్పాలంటే 'కుక్కమూతి పిందె' నేడు దొంగటేపులతో చేసే మాయాజాలం నిరోధించ వలసిన అంశం.      


తన పదవి అధికారాలకోసం, సాక్షాత్తూ దేశాన్ని రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయటానికైనా వెనుదీయనీ ఆయన ప్రయత్నం దేశప్రజలు హర్షించరు. కుటిల శకుని వ్యూహాల తో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన గో టేపులు “ధృవీకరించవలసిన” అవసరాన్ని సైతం నిర్లక్ష్యం చేయటం ఒక ప్రతిపక్ష నేతగా ఆయన స్థాయిని నేలాబారుకు దిగజార్చింది.    
సంబంధిత చిత్రం
ఆ టేప్ లో గోవా మంత్రి రాణా ఒక పాత్రికేయునికి గత దేశ రక్షణ మంత్రి నేటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ "రాఫెల్ ఫైల్స్" తన పడకగదిలో పడి ఉన్నట్లు  చెప్పారని చెప్పినట్లు సమాచారం అందులో ఉందని అంటున్నారు. అయితే అలాంటి సందర్భమే లేదని విశ్వజిత్ రాణా ఖండిస్తున్నారు. ఆ టేపులన్ని సృష్టించినవి మాత్రమే నని నిర్ద్వంధంగా చెప్పగా రాహుల్ గాంధి మాత్రం ఆ టేపులు నిజమైనవేనని దృవీకరించలేక పోవటమె దేశాన్ని రాహుల్ తప్పుదారి పట్టించటానికి పూనుకున్న విషయం అర్ధమౌతుంది.

rahul hugged PM  కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: