న్యాయం మారుతూ ఉంటుంది. అది కాలాల బట్టి, ప్రాంతాల బట్టి, యుగాల బట్టి పరిణామ క్రమం చెందుతూ ఉంటుంది. కానీ ధర్మం  అలా కాదు, అది స్థిరంగా ఉంటుంది. దానికి తర భేదాలు ఉండవు, ప్రాంతాలు, కాలాలు అంతకంటే ఉండవు, అది శాశ్వతంగా ఉంటుంది, ఒకటే చెబుతుంది. అందుకే న్యాయానికి, ధర్మానికి ఎపుడూ ఘర్షణ ఉంటుంది. రెండింటినీ సమన్వయం చేయడం కష్టం. ఓ విధంగా అసాధ్యం. అందుకే ధర్మాన్ని దాని పని చేయనివ్వాలి. అందులో జోక్యం కూడదు.


శబరిమలలో రణం :


కేరళలోని శబరిమల ఇపుడు రగులుతోంది. ఎంతలా అంటే అగ్గి పుల్ల గీయకపోయినా అక్కడ మంటలు రాజుకుంటున్నాయి. నిన్నటి వరకూ శరణం అయ్యప్పా అని గోషించిన కొండల్లో ఇపుడు రణమే శరణ్యం ఐంది. దీనికంతటికీ అచార ధర్మాన్ని ధిక్కరించడం, న్యాయాదేశం అనుకూలంగా ఉందని తెగించి ముందుకు పోవడం. అందుకే ఇది ధర్మానికి న్యాయనికి ఏర్పడిన ఘర్షణగా చెప్పాలి. ధర్మం
 ఏం చెబుతుందో అక్కరలేని వారు దానితో సంఘర్షిస్తున్నారు. . న్యాయమే గెలవాలని పట్టుపడుతున్నారు. ఈ రెండిటికీ తగవు రాజుకున్న వేళ పవిత్రమైన కొండల్లో ఆవేశ కావేశాలు పెచ్చరిల్లుతున్నాయి.


ఆ ఇద్దరితో వివాదం :


దాదాపు నెలన్నర‌ రోజుల క్రితం  దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పును వెలువరించింది. శబరిమలలో ఎవరైన ప్రవేశించవచ్చు అని ఆ తీర్పు సారాంశం. దానిని పట్టుకుని నాటి నుంచి నేటి వరకూ అక్కడ సాగుతున్న పోరాటంలో రెండు రోజుల క్రితం ఓ కీలకమైన మలుపుగా పరిణాం ఒకటి చోటు చేసుకుంది. యాభై ఏళ్ల వయసు లోపు వయసు కలిగిన మహిళలు శబరిమళలో  ప్రవేశించవచ్చునన్న కోర్టు తీర్పు మేరకు బిందు అమ్మినికి 42 ఏళ్లు. కనకదుర్గకు 41 ఏళ్లు వయసు ఉన్న  ఇద్దరు మహిళలు శబరిమలలో అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.


వీరు యూనిఫారంలో ఉన్న   పోలీసులు, మఫ్టీలో ఉన్న పోలీసులు సాయంతో వెళ్ళారు. తెల్లవారుజామున మూడుగంటలకు ఈ దర్శనం జరిగింది. దాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ ధ్రువీకరించారు కూడా. అంతే ఆ వార్త దావానలంలా  వ్యాపించింది. నిన్న మొత్తం కేరళ అగ్ని గుండమైపోయింది. హిందు మత  సంస్థలు , అయ్యప్ప భక్తులు అంతా కలసి నిర్వహించిన బంద్ ఉద్రిక్తలకు దారితీసింది అరవైకి పైగా బస్సులు ద్వంసం అయ్యాయి. 


ఇదీ విషయం :


బిందు, కనకదుర్గ డిసెంబర్‌ 24వ తేదీనే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆరెస్సెస్‌ కార్యకర్తల ఆందోళన వల్ల అది వారికి సాధ్యం కాలేదు. దాంతో వారు అజ్ఞాతంలోకి  వెళ్లారు. ఈ వారం రోజులు వారు కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా ఎలాంటి కాంటాక్టు పెట్టుకోలేదు. వారిలో కనకదుర్గ కుటుంబమైతే ఆమె తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయ్యప్ప ఆలయ సందర్శనానికని వెళ్లి అదృశ్యమైందని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పారు. వారు ఈ వారం రోజులపాటు పోలీసుల రక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 


లింగ వివక్షను రూపుమాపాలంటూ కేరళలో 620 కిలోమీటర్ల పొడవున మహిళల మానవహారం ప్రదర్శన జరిపిన మరునాడే, అంటే ఈ నెల 1న  ఎర్నాకులం నుంచి బయల్దేరి అయ్యప్ప ప్రవేశ ద్వారమైన పంపాకు చేరుకున్నారు. వారు అక్కడి నుంచి పోలీసు ఎస్కార్ట్‌ సహాయంతో రాత్రి 2.30 గంటలకు కొండలపైకి బయల్దేరి వెళ్లారు. 2న తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. 3.45 గంటలకు గర్భగుడిలోకి ప్రవేశించి ప్రార్థనలు జరిపారు.


రాజకీయం తో రచ్చ :


ఇక శబరిమలలో నమ్మకం, ధరం ఓ వైపు ఉంటే న్యాయం పేరు మీద రాజకీయం చెస్తున్న‌ వారు ఉన్నారు. అక్కడ ఉన్నది దేముడిని నమ్మని వామపక్ష ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వానికి దేముడి వ్యవహారాలు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సుప్రీం తీర్పుని అమలు చేస్తామని అంటున్న అక్కడి ప్రభుత్వం రాజధర్మాన్ని మరచిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి అందరూ ఒక్కటే అన్నది రాజధర్మం. వివక్ష లేకుండా చూడాల్సిన కర్తవ్యం ఏలిన వారికి ఉంటుంది, కానీ పాలకులు మాత్రం తాము నమ్మినదే అందరూ నమ్మాలని అంటున్నారు.


నిజానికి రెండు భిన్న వాదనలు ఉన్నపుడు పెద్దగా ప్రభుత్వం బాధ్యతతో  చర్చలు జరపాలి. ప్రభుత్వం ఆ విధంగా వ్యవరించకుండ రచ్చకు మరింతగా ఆస్కారం కల్పిస్తూ తామే మద్దతుగా నిలిచి శ‌బరిమల ఆలయంలోకి ఇద్దరు ఆడవారిని పంపడం ఇపుడు మొత్తం పరిస్థికి అదుపు తప్పేట్లుగా చేస్తోంది. మరి దీని పర్యవశానాలు ఎలా ఉంటాయో కానీ, ధర్మం , న్యాయానికి పోరాటంలో చొరబడిన రాజ‌కీయం కొత్త చిచ్చును రేపుతోంది. ఇది ఆరని మంటేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: