జనసేనాని పవన్ తొలిసారిగా 2019 ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఆయన పార్టీని 2014లోనే ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికల గోదాలోకి దిగడం మాత్రం ఇదే ప్రధమం. దాంతో పవన్ బలం ఎంత, ఆయన ప్రభావం  ఏ స్థాయిలో ఉంటుంది అన్నది లెక్కలకు అందడం లేదు. తలపండిన రాజకీయ విశ్లేషకుల నుంచి సీనియర్ పొలిటీషియన్ల వరకూ అంతా పవన్ ని తక్కువ అంచనా వేయడంలేదు.


పెను ప్రభావమేనా :


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లొకి రాకముందు ప్రముఖ సినిమా నటుడు. ఆయనంటే యూత్ లో ఉన్న్ క్రేజ్ అంతా ఇంతా కాదు. అటువంటి పవన్ రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఇక్కడ లెక్కలు చూసుకున్నా పవన్  క్రౌడ్ పుల్లరే అవుతారని అంటున్నారు. పవన్ సామాజిక వర్గం ఏపీలో బలమైనది. దానికి తోడు సినిమా గ్లామర్ ఉండనే ఉంది. ఇంకో వైపు యూత్ ఐకాన్ గా పవన్ ఉన్నారు. కొత్త పార్టీ,  సరికొత్త రాజకీయం తాలూకా తాజాదనం కూడా కలసివస్తోంది. ఇవన్నీ  చూసుకున్నపుడు పవన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని అంతా భావిస్తున్నారు. అయితే పవన్ ఎంత మేరకు ప్రభావం చూపిస్తారన్నది మాత్రం ఏ సర్వేకు అందడం లేదు ఎవరూ చెప్పలేకపోతున్నారు.


టీడీపీకి దెబ్బేనా :


పవన్ వల్ల తెలుగుదేశం పార్టీకి దెబ్బ పడుతుందా అంటే ఇది అర్ధ సత్యంగానే చెప్పాలి. గత ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ వర్గాలు పవన్ వెంట ఉన్నాయని, ఇపుడు పవన్ కి వారు ఓటు వేస్తారని కొందరు రాజకీయ పండితులు ఏవేవో లెక్కలు కడుతున్నారు. కానీ అవన్నీ లాజిక్కుకు అందనివే. ఎన్నికల సమరం ప్రారంభమయ్యాకనే అసలు సంగతి తెలుస్తుంది.  ముఖ్యంగా అభ్యర్ధుల ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణం. ఎన్నికల వ్యూహాలు, మ్యానిఫేస్టో వంటివెన్నో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఆ విధంగా చూసుకున్నపుడు టీడీపీ అగ్రభాగన్లోనే  ఉంటుంది ఆ పార్టీ అధికారంలో కూడా ఉంది. అన్ని సమీకరణలను చూసుకుని మరీ యుద్ధానికి సిధ్ధమవడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య.


విపక్ష ఓట్లలో చీలిక :


ఇక ఏపీలో మూడు ప్రధాన పార్టీలూ పోటీ పడ్డపుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష ఓట్లలో చీలిక వస్తుందన్న లెక్కలు కొంతమంది చెబుతున్నారు.  ఇది కూడా తార్కికంగా చూసే కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే పొలరైజేషన్ జరిగినపుడు ఫలాన అభ్యర్ధిని ఫలనా అభ్యర్ధి మాత్రమే ఢీ కొట్టగలడన్నది తెలినపుడు పార్టీ అన్నది చూసుకోకుండా ఓటు వేయడం  జరుగుతుంది. అలాంటపుడు, గెలుపు అన్నదే అక్కడ ప్రధాన  పాత్ర పోషిస్తుంది
 అలా చూసుకుంటే గెలుపు గుర్రాలను ఎవరు జాగ్రత్తగా ఎంపిక చేసుకుని దూసుకుపోతారో వారికే జనం ఓట్లు వేస్తారు. ఈ విధంగా విశ్లేషించినపుడు పవన్ ఫ్యాక్టర్ అన్నది ఎంత ఉన్నా అది కేవలం అధికార పార్టీక నష్టపరచి ఊరుకోదు, అలాగే ప్రతిపక్ష పార్టీ ఓట్లలోనూ చీలిక తేలేదు అని కూడా చెప్పలేం. మొత్తానికి చూసుకుంటే ఓటరు చాల తెలివితోనే ఓటు చేస్తూ వస్తున్నాడు. అందువల్ల నామినేషన్ ఘట్టం ముగిసి పోలింగుకు గడువు దగ్గర పడ్డాక మాత్రమే పవన్ ఫ్యాక్టర్ ఏంటన్నది చాలా వరకూ అంచనా వేయగలమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: