చంద్రబాబునాయుడును వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాగే మరో న్యాయవాది శ్రవణ్ కుమార్ కూడా వెంటాడుతున్నారు. మొన్నటి వరకూ చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవకతవకలపై  హై కోర్టులో పిటీషన్ వేయాలంటే హైదరాబాద్ కు రావాల్సొచ్చేది. కానీ ఇపుడు హైకోర్టు విజయవాడకే వచ్చేసింది కదా ? అందుకే శ్రవణ్  పని మరింత సులువైంది. అందుకే ఏపికి కొత్తగా ఏర్పడిన హై కోర్టులో చంద్రబాబుపై కొత్తగా మరో కేసు విచారణకు వస్తోంది. వేలాది ప్రభుత్వ భూములను బోగస్, షెల్ కంపెనీలకు దారాదత్తం చేసేస్తున్నారంటూ న్యాయవాది కేసు వేశారు. తన వాదనకు తగ్గట్లుగా ఆధారాలను కూడా పిటీషన్లో జత  చేశారు. ఇఫుడా కేసే ఈరోజు హై కోర్టులో విచారణకు రానుంది. అందుకు వీలుగా హై కోర్టు ఏపి ప్రభుత్వానికి, ఏపిఐఐసికి, సిబిఐ, ఏసిబి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట కు కూడా కోర్టు నోటీసులు అందిచటం గమనార్హం.

 

ఆళ్ళ వాదన ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం 4 వేల కంపెనీలకు విలువైన 14,900 ఎకరాలను కట్టబెట్టిందట. వీటిల్లో ఎక్కువభాగం బోగస్, షెల్ కంపెనీలేనట. భూములు అందుకున్న బోగస్, షెల్ కంపెనీల వివరాలను పిటీషనర్ అడిగినా చాలా శాఖలు ఇవ్వలేదు. చివరకు సమాచార హక్కు చట్టం క్రింద ప్రశ్నించినపుడు కేవలం 200 కంపెనీల వివరాలు మాత్రమే వచ్చింది. ఆ కంపెనీల అడ్రసుల ప్రకారం వాటి కార్యకలాపాలను విచారిస్తే అందులో 175 కంపెనీలు బోగస్ వే అని తేలింది. 25 కంపెనీలు మాత్రమే సక్రమమైనవట.

 

భూములు అందుకున్నబోగస్, షెల్ కంపెనీల్లో అత్యధికం చంద్రబాబు బినామీలు, టిడిపి నేతలే అని పిటీషనర్ వాదన. ఎక్కువ భూములు నారా లోకేష్ మంత్రిగా ఉన్న ఐటి శాఖలోనే పందేరం జరిగాయట. అంటే ఐటి రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు బిల్డప్ ఇస్తు వేలాది ఎకరాలను తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేస్తున్నారంటూ పిటీషనర్ వాదిస్తున్నారు. మరి భూములు ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం, పందేరం చేసిన ఏపిఐఐసి తమ చర్యలను ఏ విధంగా సమర్దించుకుంటాయో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: