వైసీపీ అధినేత జగన్ ఆస్తుల కేసు విచారణ పురోగతిపై ఇపుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అదిపుడు నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లొ  ప్రధాన పార్టీ వైసీపీ అధినేతగా ఉన్న జగన్ కి సంబంధించిన ఈ కేసు విషయం ఇపుడు సంచలనంగా ఉంది.


25కి వాయిదా :


వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీకి బదిలీ కావడంతో కొత్త జడ్జీ వచ్చే వరకు దీనిపై విచారణ నిలిచిపోనుంది. జడ్జి వెంకటరమణ రెండేళ్ల పాటు మూడు ఛార్జిషీట్లపై సుమారు 100 గంటలపాటు వాద, ప్రతివాదనలు విన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనతో వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. దీంతో కొత్త జడ్జీ వచ్చాక విచారణ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం లేకపోలేదని సీనియర్ న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనవరి ఏడు నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో.. సెలవుల అనంతరం వాదనలు ప్రారంభం కానున్నాయి.


ఎవరికి లాభం :


ఓ విధంగా జగన్ కేసు నత్త నడకగానే సాగుతోది. ఇది ఓ కొలిక్కి వస్తే బాగుడునని వైసెపీ నాయకులు అనుకుంటున్నారు. ఎందుచేత‌నంటే చాల వరకూ ఈ కేసులో వాదనలు బలహీనంగా ఉండడం, ఆధారాలు కూడా లేకపోవడం వల్ల ఈ కేసు నిలబడదని మొదటి నుంచి న్యాయ నిపుణులు అంటూనే ఉన్నారు. దాంతో ఎంత వీలైతే అంత తొందరగా ఈ కేసులో తీర్పు వస్తే జగన్ కి క్లీన్ చిట్ లభిస్తుందని వైసీపీ నేతలు ఆశాభావంగా ఉన్నారు. ఇపుడు ఈ కేసు మళ్ళీ మొదటికి వస్తే మరెన్ని ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలన్న ఆవేదన కూడా వైసీపీ నాయకుల్లో ఉంది.


టీడీపీకి ఆయుధం :


ఇక ఈ కేసు అంతా అనుకుంటున్నట్లుగా మళ్ళీ మొదటికి వస్తే మాత్రం టీడెపీకి ఆయుధంగా మారుతుందని అంటున్నారు. తాము చెప్పినట్లుగా ఈ కేసుని మరింత వెనక్కు తీసుకెళ్ళడానికే హైకోర్టు విభజన కీలక సమయంలో చేశారని చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని గట్టిగా ప్రచారం చేసుకుంటారు. మరి దీన్ని వైసీపీ ఎలా తప్పించుకుంటుందో, ఎలాంటి కౌంటర్లు ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: