గత మూడు రోజులుగా రాఫేల్ పై లోక్ సభలో చర్చలు, రగడ కొనసాగుతుంది. నేడు లోక్ సభలో రాఫేల్ పై వాడీ వేడిగా చర్చలు నడిచాయి.   కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. హెచ్ ఏ ఎల్ పనికిమాలిన సంస్థని యూపీఏ తెల్చింది. డిఫెన్స్ కొనుగోళ్లలో కాంగ్రెస్ వి అన్నీ దురుద్దేశాలే. హెచ్ ఏ ఎల్  కు బీజేపీ సర్కార్ ఇచ్చినన్ని కాంట్రాక్ట్ లు యూపీఏ ఇవ్వలేదని అన్నారు నిర్మాలా సీతారామన్. మన్మోహన్ సింగ్ హయాంలో డిఫెన్స్ కు చేసిందేమీ లేదు. హెచ్ ఏ ఎల్  బాగు కోసం యూపీఏ ఏం చేసిందని ప్రశ్నించారు.
Parliament LIVE Updates: Congress Sheds Crocodile Tears For HAL, Says Defence Minister
రాఫెల్ తయారీ హెచ్ ఏ ఎల్  జన్మహక్కా అంటూ ఆవేశంగా ప్రశ్నించారు.  2022 కల్లా 365 రాఫెల్ విమానం డెలివరీ. డబ్బులు లేవు కనుకనే కొనడం లేదని నాటి రక్షణ మంత్రి అన్నారని గుర్తు చేశారు.  రాబర్ట్ వాద్రాకు కమిషన్ రాలేదు..కనుకనే కొనలేదా అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.  రాఫెల్ డీల్ కు మొకాలడ్డింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.  డిఫెన్స్ డీల్స్ కాంగ్రెస్ కు సంతృప్తి కరంగా ఉంటేనే కొంటారా అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం కమీషన్లపై లెక్క తేలలేదు..అందుకే ఈ నిర్వాకానికి పూనుకున్నారు.

యూపిఏ హయాంలో జరిగిన ఒప్పందంలో అనేక లోపాలు ఉన్నాయి. యూపీఏ తీరు వల్లే డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రతిష్టంభన.  18 విమానాల స్థానంలో 36 విమానాలు కొనాలని మేం నిర్ణయించాం.  యూపీఏ ఒక స్క్వాడ్రన్ కొనాలనుకుంటే మేం 2 స్క్వాడ్రన్ కొంటున్నాం. రాహూల్ లోక్ సభలో దేశాన్ని తప్పుదోవ పట్టించారు. హోలేండీ వ్యాఖ్యలపై రాహూల్ తప్పుడు సమాచారం ఇచ్చారు. రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ ఆరోపణలు సరైనవి కావు అంటూ నిర్మలా సీతారామన్ అన్నారు. మంత్రి తన పేరును ప్రస్తావించడం పై రాహూల్ అభ్యంతరం. హోలేండీతో రాహూల్ భేటీని ధ్రువీకరించాలి. మాజీ రక్షణ మంత్రి సభలో మాట్లాడుతుంటే పేపర్ ప్లేన్లు విసిరారు.
Image result for lok sabha nirmala sitharaman
మాజీ మంత్రి ఏం మాట్లాడుతున్నారో వినే ఓపిక కూడా వాళ్లకు లేదు. హెచ్ ఎ ఎల్ గొప్పల్నే తప్ప, లోపాల్ని కాంగ్రెస్ ప్రస్తావించడం లేదు. హెచ్ ఎ ఎల్ ఏడాదికి కేవలం 8 తేజస్ విమానాల్ని మాత్రమే చేయగలదు.  మా హయాంలో హెచ్ ఎ ఎల్ సామర్థ్యం రెట్టింపు చేశాం. 43 విమానాలకు ఆర్డరిస్తే..హెచ్ ఎ ఎల్ కేవలం 8 విమానాలు మాత్రమే అందజేసిందని నిర్మలా సీతారామన్ అన్నారు.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దేశాన్ని తప్పదోవ పట్టిస్తుందని ఆమె ధ్వజమెత్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: