ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థనరెడ్డి తెలుగుదేశంపార్టీపై చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీతో పొత్తుకోసం తహతహలాడుతోందని ఆరోపించారు. దీనిని టీడీపీ నేతలు అంగీకరించాలని సవాల్ విసిరారు. తాము బీజేపీతో పొత్తుకు ప్రయత్నించడం లేదని టీడీపీ నేతలు ఎవరైనా చెప్పగలరా? అంటూ చాలంజ్ చేశారు.
bjp vice president AP vishnuvardhan reddy కోసం చిత్ర ఫలితం
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి టీడీపీ నేతలు బీజేపీ కేంద్రకార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఋజువు చేయటానికి తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు వివరించారు. బిజేపి కేంద్ర కార్యాలయం చుట్టూ తిరిగిన తెలుగుదేశం నేతలు, బీజేపీ ప్రముఖులతో సమావేశమైన టిడిపి నేతల రహస్య వీడియోలు తన దగ్గర ఉన్నాయన్నారు. వాటిని బయట పెడతామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి అంత్యకాలం దాపురించనుందని హెచ్చరించారు. 
సంబంధిత చిత్రం
ఈ నెల 18 నుండి బిజెపి అధ్యక్షులు అమిత్‌ షా రాయలసీమలో పర్యటించనున్న దృష్ట్యా - టిడిపి వాళ్లకు నిజంగా ధైర్యముంటే అమిత్‌ షా పర్యటనను అడ్డుకోవాలని  సవాల్ విసిరారు. తెలుగు దేశం పార్టీ నేతలు సీబీఐ, ఈడీలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి జరగకపోతే  సీబీఐ, ఐటీని టీడీపీ ఎందుకు అడ్డుకుంకుందని ప్రశ్నించారు. 6వ విడత జన్మభూమి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోందని వేలసంఖ్యలో ప్రజల విన్నపాలు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు.


దేశంలో ఎక్కడా జరగనన్ని కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగాయని ఆయన ఆరోపించారు. దేశంలో ఏ ప్రభుత్వం చెయ్యనంత అవినీతి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం మాత్రమే
 చేసిందని విమర్శించారు. అగ్రిగోల్డ్  కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరగగా, దాని ఆస్తులను కొల్లగొట్టేందుకు టీడీపీ మంత్రివర్గం మొత్తం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 
bjp vice president AP vishnuvardhan reddy కోసం చిత్ర ఫలితం
రెండు రోజుల క్రితం జనసేన పవన్ కళ్యాణ్ తో కలిసి పొత్తు పంచుకుంటే - పోటీ చేస్తే వైసిపి జగన్మోహనరెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయం గా పెద్ద దుమారం రేపాయి. చివరికి జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి తనకు ఏ పార్టీతో పొత్తుపెట్టుకునే ఉద్దేశంలేదని మొత్తం 175స్థానాలలో వామపక్షాలతో కలసి పోటీ చేయనున్నా మని వివరణ ఇస్తే కానీ చంద్రబాబు తన అబద్ధాల ప్రచారానికి ఫుల్-స్టాప్ పెట్టలేదు.  


తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఈ విషయం తప్పని  చెపితే తాను ఆ వీడియోలు విడుదల చేస్తానని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుటు ఆంధ్రప్రదేశ్ లో హాట్-టాపిక్ గా మారాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: