అవును చూడబోతే అలాగే ఉంది చంద్రబాబునాయుడు మీడియా వ్యవహారం. తనతొ పొత్తుకు నిరాకరించిన వారందరి మీదా చంద్రబాబు బిజెపి ముద్ర వేసేస్తున్నారు. కావాలంటే కెసియార్ విషయమే తీసుకోండి. తెలంగాణా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదించినా కెసియార్ తిరస్కరించినట్లు చాలా సార్లు చంద్రబాబే చెప్పారు. అయితే, కెసియార్ ఎందుకు తిరస్కరించారంటే అందుకు నరేంద్రమోడినే కారణమని ఇపుడు చెబుతున్నారు. అంటే కెసియార్ పై చంద్రబాబు బిజెపి ముద్ర వేసేశారన్నమాట. చంద్రబాబు నాలుగు మాటలు మాట్లాడితే చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియా ఇరవై సార్లు  అచ్చేస్తోంది.

 

 పొత్తులు పెట్టుకోవాలని తాను ఎలా అనుకున్నాడో వద్దని చెప్పటానికి కెసియార్ కు కూడా అంతే హక్కుందని చంద్రబాబు అంగీకరించటం లేదు. చంద్రబాబు వరస చూస్తుంటే తాను ఎవరితో పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటే వారంతా తనతో కలవటానికి ఒప్పేసుకోవాల్సిందే అన్నట్లుంది. ఇటువంటి పనికిమాలిన లాజిక్కులు చంద్రబాబుకు తప్ప ఇంకెవరికీ రావనటంలో సందేహం అవసరమే లేదు.

 

ఇఫుడు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకుందామని చంద్రబాబు అనుకున్నారు. అయితే, చంద్రబాబు ప్రతిపాదనను పవన్ తిరస్కరించారు. రెండోసారి కుప్పం జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కూడా బహిరంగంగానే పొత్తు పెట్టుకోవాలంటూ వేడుకున్నారు. అయినా కారణాలు తెలీదు కానీ పవన్ రెండోసారి కూడా చీ కొట్టేశారు. దాంతో ఏం  చేయాలో దిక్కుతోచటం లేదు చంద్రబాబుకు. అయినా సరే మళ్ళీ మళ్ళీ పవన్ ను గోకుతునే ఉన్నారు. పవన్ వైఖరిలో గనుక మార్పు రాకపోతే ఇక పవన్ మీక కూడా బిజెపి ముద్ర వేసేట్లుగా ఉన్నారు. ఎలాగంటే తనతో పవన్ పొత్తు పెట్టుకుందామని అనుకున్నా మోడి అడ్డుపడ్డారని అంటారు. అదే సమయంలో పవన్ కూడా మోడి మనిషే అనే ముద్ర వేయటానికి చంద్రబాబు మీడియా ఎటూ సిద్ధంగా ఉంటుంది కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: