వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీకి అన్ని వైపులా ఇబ్బందులు ఓ వైపు ఉంటే రాజకీయం బాగా తెలిసిన వారు సైతం అపశకునాలే  వల్లిస్తున్నారు. టీడీపీకి పెద్ద దెబ్బే పడుతుందని రాజకీయల్లో ఏళ్ళ తరబడి మునిగి తేలిన సీనియర్ రాజకీయ నాయకుడొకరు ఘాటు కామెంట్స్ చేశారు.


ఇక్కడిలా :


ఓ వైపు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో తెలియక టీడీపీ అధినాయకత్వం తికమక పడుతోంది. పాత మిత్రుడు పవన్ని కెలికితే ఆయన కాదు పొమ్మన్నాడు, ఇక తెలంగాణాలో కాంగ్రెస్ తో కలసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో భంగపడిన తరువాత ఆ ప్రయోగం ఏపీలో వర్కౌట్ అవుతుందా అన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి. ఇలా తలో రకంగా అలోచనలు పసుపు శిబిరంలో సాగుతూంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏపీలో టీడీపీకి పెద్ద దెబ్బ పడిపోతుందని జోస్యం చెప్పేశారు. విశాఖలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉండవల్లి ఈ విధంగా తేల్చేశారు. 
 టీడీపీతో పొత్తు వల్ల తెలంగాణాలో కాంగ్రెస్ భారీగా నష్టపోయిందని, ఇక ఏపీలో కాంగ్రెస్ తో కలిస్తే టీడీపీకి ఓటమి ఖాయమని ఉండవల్లి విశ్లేషించారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ ని ఇంకా ఏపీ ప్రజలు మరచిపోలేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ తో టీడీపీకి చలి జ్వరం వస్తోందట.


ఆడి కారులో వెళ్తారా:


ఇక ఏపీకి కేంద్రం నిధులు సరిగ్గా ఇవ్వకపోవడానికి చంద్రబాబు ప్రభుత్వం వైఖరే కారణమని ఉండవల్లి తీర్మానించారు. ఆడి కారు లో వెళ్ళి అడుక్కుంటే ఎవరైనా డబ్బులు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. బాబు తీరు కూడా అలాగే ఉందని, ఓ వైపు అన్ని విధాలుగా ఏపీ వెలిగిపోతోందని, బిల్డప్పులు ఇస్తూ మరో వైపు  కేంద్రం ఏమీ ఇవ్వలెదని  ప్రచారం చేస్తున్నారని ఆయన డెప్పిపొడిచారు. బాబు బిల్డప్పులు ఆపాలని సూచించారు. మొత్తానిక్ సూటిగా, సుత్తి లేకుండా ఉండవల్లి వేస్తున్న బాణాలు టీడీపీకి బాగానే తగులుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: