చంద్రబాబునాయుడును చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఓటమి భయం చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లేకపోతే మరీ ఇంతలా దిగజారరు. ఇంతకీ విషయం ఏమిటంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కొంతకాలం క్రితం వరకూ ఇటు కాంగ్రెస్ ను అటు పవన్ పైన ఇదే చంద్రబాబు ఒంటికాలిపై లేచిన విషయం అందరూ చూసిందే. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవటానికి భయపడుతున్నారు. అందుకే ముందుగా కాంగ్రెస్ తో లైన్ కలిపారు. ఇపుడు పవన్ కల్యాణ్ ను గోకుతున్నారు.

 

 కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని తెలంగాణాలో పోటీ చేసిన చంద్రబాబుకు మాడు పగిలేట్లు జనాలు బుద్ధి చెప్పారు. అంటే కాంగ్రెస్ కు కూడా అదే సత్కారం జరిగింది లేండి.  రేపు ఏపి ఎన్నికల్లో కూడా దాదాపు అదే పరిస్ధితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తోంది. అందుకనే కాంగ్రెస్ పై భ్రమలు తొలగిపోయిన చంద్రబాబు వెంటనే పవన్ పై దృష్టి పెట్టారు. టిడిపితో పొత్తు పెట్టుకోవాలని పవన్ ను పదే పదే చంద్రబాబు ప్రాదేయపడుతున్నారు. రేపటి ఎన్నికల్లో జనసేన ఎవరితోను పొత్తు పెట్టుకునేది లేదని పవన్ కూడా గట్టిగానే జవాబు చెప్పారు. అయినా మళ్ళీ పొత్తు పెట్టుకోవాలంటూ చంద్రబాబు మళ్ళీ మళ్ళీ అడుతున్నారు.

 

అదే సమయంలో మోడిపైన కూడా రాళ్ళు విసిరారు లేండి. తనంతట తానుగా ఎన్డీఏ లో నుండి బయటకు రాలేదని తాజాగా చెప్పటం గమనార్హం. బిజెపినే తనను మోసం చేసిందని విచిత్ర వాదన మొదలుపెట్టారు. రాష్ట్రానికి కేంద్రం 11 జాతీయ సంస్ధలను ముష్టి వేసినట్లు వేసిందన్నారు. అమరావతికి ఇచ్చిన రూ 1500 కోట్లు కూడా ముష్టేనంటున్నారు. డబ్బులిచ్చిన కేంద్రం లెక్కలడగ కూడదట. డబ్బులిచ్చి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు అడగటమేంటి అంటూ మండిపడ్డారు.


పైగా విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉదారంగా వ్యవహరించిందని ఇపుడు చెబుతున్నారు. మొన్నటి వరకూ ఇదే చంద్రాబాబు రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు సోనియాగాంధి, రాహూల్ గాంధీలను అమ్మనాబూతులు తిట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మొత్తానికి ఒకపుడు తిట్టిన నోటితోను ఇపుడు పొగుడుతున్న చంద్రబాబును చూస్తే ఎంతగా దిగజారిపోయారని ఆశ్చర్యపోతున్నారు జనాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: