వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర చివరి దశకు చేరుకున్న క్రమంలో వైసీపీ పార్టీ నేతలు చివరిగా జరిగే భారీ బహిరంగ సభకు ముమ్మరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఏ రాజకీయనాయకుడు చేయని విధంగా తన కుటుంబాన్ని వదిలి సామాన్య ప్రజల కోసం సామాన్యుడిలా మారి భగభగ మండే ఎండలు లెక్కచేయక గాలివాన లను సైతం లెక్క చేయకుండా తనపై ప్రాణాపాయ దాడులు జరిగిన వాటికి భయపడకుండా రాష్ట్ర విభజనతో నలిగిపోయిన ప్రజల కోసం  ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేస్తూ ప్రతి సామాన్యుడి దగ్గరకు వెళ్లి వారి బాధలను ఓపికగా వింటూ వారికి ధైర్యాన్నిస్తూ మరోపక్క తనకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్న రాజకీయ పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తూ దేశ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా సరికొత్త చరిత్ర సృష్టించి దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు కాలినడకన నడిచారు వైసీపీ అధినేత జగన్.

Image result for crowd jagan

ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతలు జగన్ వేసిన మొదటి అడుగు సందర్భంలో పాదయాత్ర గురించి పెద్దగా పట్టించుకోలేదు ఆ సమయంలో కూటమిగా ఉన్న బిజెపి జనసేన మరియు అధికార పార్టీ టిడిపి జగన్ పాదయాత్ర సగం పూర్తయ్యేసరికి 3 గా ఉన్న పార్టీలు మూడుగా చీలి పోయాయి. దీంతో జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ అధికార పార్టీ టీడీపీకి గట్టిగా తగిలింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Image result for crowd jagan

ఇదే క్రమంలో త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జాతీయ సర్వేలో లోను మరియు వివిధ సంస్థల సర్వేల్లోనూ రాబోయే రోజుల్లో వైసిపి పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరోపక్క పాదయాత్ర చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో చివరిగా ఇచ్చాపురం లో జరిగే భారీ బహిరంగ సభకు 13 జిల్లాల నుండి దాదాపు రెండు లక్షల మంది జనం వస్తున్నట్లు పార్టీ నుండి వస్తున్న సమాచారం. పాదయాత్రలో దాదాపు రెండు వేల పైగా గ్రామాలు పాదయాత్ర చేసిన జగన్ ప్రతి సమస్యను క్షున్నంగా గ్రౌండ్ లెవెల్ నుండి తెలుసుకోవడం విశేషం.

Related image

దాదాపు 135 నియోజకవర్గాల్లో సంవత్సరం పైగా పాదయాత్ర చేసిన జగన్ పై ప్రజలు కచ్చితంగా తండ్రికి మించిన తనయుడు అవుతారని అంటున్నారు. ఈ క్రమంలో పాదయాత్ర చివరి దశకు వచ్చిన నేపథ్యంలో వైసీపీ పార్టీ క్యాడర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చివరిగా జరిగే భారీ బహిరంగ సభకు రావాలని ఆహ్వానించారు. ఇదే క్రమంలో రానివారు ఈ దుష్ట పరిపాలన నుండి విడిపించాలని తమకు దగ్గరగా ఉండే ప్రాంతాలలో ఏ మతానికి సంబంధించిన వారు ఆ మతానికి సంబంధించిన దేవుడి దగ్గరికి వెళ్లి మంచి పరిపాలన అందించే జగన్ కోసం వేడుకోవాలని వైసీపీ పార్టీ నేతలు రాష్ట్ర వైసీపీ కార్యకర్తలకు మరియు ప్రజలకు తెలిపారు. చివర బహిరంగ సభకు వీలైతే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా రావాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: