ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఝలక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత కాలంలో టీడీపీలో జంప్ కొట్టారు. అందుకు ప్రతిఫలంగా మంత్రి పదవి కూడా అందుకున్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో టీడీపీలో ఇంటిపోరు కూడా మొదలైంది.

adinarayana reddy vs ramasubbareddy కోసం చిత్ర ఫలితం


జమ్మలమడుగులో టీడీపీలో ఉన్న రామసుబ్బారెడ్డి వర్గం మొదటి నుంచి ఆదినారాయణరెడ్డి రాకను వ్యతిరేకిస్తోంది. కానీ చంద్రబాబు వైసీపీని దెబ్బ కొట్టే క్రమంలో ఆదినారాయణరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పారు. ఐతే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఇరు వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరింది.

సంబంధిత చిత్రం


జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్‌ను ఇరువర్గాలు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు టిక్కెట్‌ను సీనియర్ నేత రామసుబ్బారెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గం షాక్‌ కు గురైంది. మంత్రి పదవి ఉన్నా టికెట్‌ సంపాదించుకోలేకపోతున్నామన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

adinarayana reddy vs ramasubbareddy కోసం చిత్ర ఫలితం


అయితే ఆదినారాయణరెడ్డిని పార్లమెంటుకు పోటీ చేయాలని చంద్రబాబు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక దశలో రాజీపడిన మంత్రి ఆదినారాయణ రెడ్డి కనీసం తన కుమారుడికి ప్రొద్దుటూరు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. దీనిపై చంద్రబాబు ఇంకా ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. వైసీపీ నుంచి వలస వచ్చిన సీట్లలో ఇలాంటి తలనొప్పులు ఇంకెన్ని వస్తాయో..!


మరింత సమాచారం తెలుసుకోండి: