కొన్ని రోజుల నుంచి బాలకృష్ణ ను నాగబాబు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. చివరికి ఎన్టీఆర్ బయో పిక్ మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన తమ్ముడి పార్టీ తరఫున క్రియాశీల పాత్ర పోషించాలని తహతహలాడిపోతున్న ఆయన.. బాలయ్యను లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఏదో ఒకసారి రెండుసార్లంటే ఓకే కానీ.. అదే పనిగా బాలయ్య మీద సైటెర్లు గుప్పించడమే అతిగా అనిపిస్తోంది. చివరగా ఆయన చేసిన ‘బ్రీడ్-బ్లడ్’ కామెంట్లతో నందమూరి అభిమానులకు మండిపోయింది. చివరికి ఎన్టీఆర్ బయోపిక్‌ మీద కూడా సెటైర్లు వేశాడు నాగబాబు.


నాగబాబు తీరుతో మండిపోతున్న బాలయ్య అభిమానులు.. నాగబాబు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నారు. ఆయన చెన్నైలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఒక వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లాడు. దీంతో అక్కడున్న బాలయ్య అభిమానులు రెచ్చిపోయారు. నాగబాబు కనిపించగానే జై బాలయ్య నినాదాలతో హోరెత్తించేశారు. నాగబాబు డౌన్ డౌన్ అని కూడా అరిచారు. అంతకంతకూ నినాదాలు పెరిగాయే తప్ప తగ్గలేదు.
Image result for nagababu
దీంతో నాగబాబు అక్కడ ప్రసంగం కూడా చేయకుండానే నిష్క్రమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తానికి ఇన్నాళ్లూ బాలయ్యను గిల్లుతూ వినోదం చూసిన నాగబాబు.. తొలిసారి బాలయ్య అభిమానుల నుంచి ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అనవసరంగా వివాదాన్ని పెద్దది చేయడమెందుకని ఇకనైనా ఆయన తగ్గుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: