ఏ పార్టీ అయినా అధికారం లో కి రావాలంటే గోదావరి జిల్లా ల్లో ఎక్కువ సీట్లు ఖచ్చితంగా గెలవాల్సిందే. లేకపోతే అధికారం నిలుపుకోవటం చాలా కష్టమని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే పలు సర్వేలు ఈస్ట్ , వెస్ట్ జిల్లా ల్లో టీడీపీ హవా ఉండదని ప్రధానంగా వైసీపీ, జనసేన ఎక్కువ స్థానాలను కొల్లగొడతాయని చెబుతున్నాయి. దీనితో ఇప్పటికే టీడీపీ అధినేత ఈ జిల్లాల మీద ప్రత్యేక దృష్టి సాధించాడు. 

Image result for chandra babu

అదేసమయంలో టీడీపీలో గ్రూపుల గొడవల కారణంగా ఆ పార్టీ ఈసారి ఇక్కడ దారుణంగా దెబ్బతినబోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.  2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ మద్దతుతో నరసాపురం లోక్ సభ - తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. ఈసారి ఆ సీట్లలో కూడా టీడీపీనే పోటీ చేయనుంది. ఎంపీ సీట్లు రెంటిలోనూ రెండు పార్టీల తరఫునా కొత్త ముఖాలు రంగంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Image result for jagan

అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో ఈ రెండు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై కొంత స్పష్టత కనిపిస్తోంది. ఏలూరు అసెంబ్లీ సీటుకు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతర్గత సమస్యలు మాత్రం ఆయన్ను వెన్నాడుతున్నాయి. వైసీపీ అభ్యర్థిత్వం పార్టీ జిల్లా అధ్యక్షుడు - ఎమ్మెల్సీ ఆళ్ల నానికి దక్కే సూచనలున్నాయి. దెందులూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్లీ పోటీ చేయనున్నారు. ప్రభాకర్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నా నియోజకవర్గంపై గట్టి పట్టున్న నాయకుడు కావడంతో అధినాయకత్వం కూడా మరో ఆలోచన చేయడం లేదు. వైసీపీ తరఫున కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి దించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: