బిజేపి నాయకత్వంలోని ఎన్డిఏ దేశవ్యాప్తంగా వ్యతిరేఖ ఫ్రంట్ "మహాకూటమికి అదే మహాఘట్భంధన్" ఏర్పాటు చేసి బిజేపికి చుక్కలు చూపించాలని కలలు కంటున్న ముప్పైకి పైగా ఉన్న దేశ వ్యాప్త ప్రాంతీయ రాజకీయ శక్తుల ఐఖ్య శిబిరం ప్రయత్నిస్తుంది. దాంట్లో దక్షిణ భారతంలోని అనేక ప్రాంతీయ శక్తులు అలాగే ఉత్తర భారతంలోని అత్యంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని బలమైన సమాజ్వాది బహుజన సమాజ్వాదీ పార్టీలు మరికొన్ని కలగూర గంప పార్టీలు కాంగ్రెస్ తో కలసి ఐఖ్య సంఘటన "మహాఘట్భంధన్" ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తు న్నాయి.

sp bsp coalation కోసం చిత్ర ఫలితం

వీటికి తోడుగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రతిపాధించిన బిజేపియేతర కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీల కూటమి నిర్మించాలని అనుకుంటూ తన ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా ముక్కోణ పోటీ తప్పేలా లేదు. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వచ్చే లోక్-సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి లేదా మహాఘట్భంధన్ ఏర్పాటుచేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో భాగస్వామ్యం అవుతారని భావించిన ఎస్పీ-బీఎస్పీలు ఆదిలోనే కాంగ్రెస్ కు షాకిచ్చాయి. దేశంలో అత్యధిక లోక్-సభ స్థానాలు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ-బీఎస్పీ మాత్రమే కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ - బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

సంబంధిత చిత్రం

ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ - బహుజన్ సమాజ్వాదిపార్టీ అధినేత్రి మాయావతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2019 లోక్-సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు యూపీలో బలమైన కూటమిగా ఏర్పడాలని నిర్ణయించిన ఇరువురు నేతలు సీట్ల పంపకాలపై కూడా చర్చించారు. ఒకప్పుడు ఢీ అంటే ఢీ అనేలాగా ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ యూపీలో బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేయటానికి వ్యూహారచన చేస్తున్నారు.

sp bsp coalation కోసం చిత్ర ఫలితం

కొద్దిరోజులుగా అత్యంత రహస్యంగా మంతనాలు జరుపుతున్న వీరిద్దరి మధ్య తాజాగా సీట్లపొత్తు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాంగ్రెస్ నేతృత్వం వహించే మహాకూటమికి దూరంగా ఉండటానికి ఈ రెండు పార్టీల అధినేతలు నిశ్చయించారు. 80 లోక్-సభ సీట్లున్న యూపీలో ఎస్పీ - బీఎస్పీ కలిసి పోటీ చేయనుండటంతో రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ కు ఇది భారీ స్తాయిలో ఎదురు దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

sp bsp coalation కోసం చిత్ర ఫలితం

సమారు గంటన్నరకు పైగా న్యూఢిల్లీలోని మాయావతి నివాసంలో సమావేశం జరిగినట్లు సమాచారం. ఎస్పీ జనరల్ సెక్రటరీ - అఖిలేష్ యాదవ్ సన్నిహితుడు రామ్ గోపాల్ యాదవ్ చర్చలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఈ రెండు పార్టీల పొత్తు దాదాపు ఖరారు కాగా, సీట్ల పంపకాలపై త్వరలో ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు, విశ్వసనీయవర్గాలు సమాచారం. రెండు పార్టీలు అక్కడ సమౌజ్జీలు కావటంతో సమాన సీట్లలోనే పోటీచేయనున్నాయని - పశ్చిమ యూపీలో బలంగా ఉన్న ఆర్ఎల్డీ లాంటి చిన్న పార్టీలను కూడా కలుపుకొని ఎన్నికల బరిలో నిఇలవాలని నిశ్చయించినట్లు తెలుస్తుంది. దీంతో మహాఘట్భంధన్, మహాకూటమి అంటూ ప్రయత్నాలు మొదలెట్టిన కాంగ్రెస్ కు ఇది రాజకీయంగా శరాఘాతమే.

మరింత సమాచారం తెలుసుకోండి: