అంతర్జాతీయంగా విఫణిలో ఓకరిపై ఒకరు పైయెత్తు సాధించటానికి తీవ్యంగా పోటీ పడుతున్నాయి అమెరికా-చైనాలు.  అయితే వీరిమద్య రాజు కున్న తీవ్ర పోటీ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్నంత క్లిష్ఠ పరిస్థితులను బహిర్గతం చేస్తున్నాయి. కారణం  ఏ క్షణంలోనైనా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి  అంటూ గత శుక్రవారం జరిగిన చైనా ఆర్మీ అత్యున్నత సమావేశం లో చైనా అధినేత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. 
international war xi jinping కోసం చిత్ర ఫలితం
అమెరికా - చైనా మధ్య, దక్షిణ చైనా సముద్రం విషయంలో నెలకున్న వివాదం దీనికి నేపథ్యం అంటున్నారు. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య తీవ్ర వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆర్మీ అధికారులతో జరిగిన సమావేశంలో అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయాన్ని జీ జిన్‌ పింగ్ వ్యక్తం చేసినట్టు అధికార పత్రిక జిణువా తెలిపింది. ఆందుకే జీ జిన్ పింగ్ వ్యాఖ్యలకు ప్రపంచ వ్యాపతంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్తులో అనేక సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందని, వీటిని ఎదుర్కొడానికి సైన్యం సర్వధా సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. కేంద్ర మిలటరీ కమిషన్‌ కు కూడా చైర్మన్‌ గా వ్యవహరిస్తోన్న జీ జిన్‌ పింగ్, సైన్యం ఎప్పటి కప్పుడు కొత్త వ్యూహాలతో కొత్త విధానాలతో కొత్త ఆయుధ సంపత్తితో ముందుకు సాగే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగాలని  సూచించారు. 
xi jinping addressed his army for global war కోసం చిత్ర ఫలితం
గత శతాబ్ద కాలంలో ఎన్నడూలేని విధంగా ప్రపంచం అనూహ్య పరిస్థితులను, సంక్లిష్ట సమస్యలను  ఎదుర్కొంటోందని, ఇలాంటి తరుణంలో అభివృద్ధికి వ్యూహాత్మక అవకాశాన్ని చైనా ఇప్పటికీ కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే దీన్ని సమర్ధంగా తిప్పికొట్టేలా సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని, తమ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచు కోవాలని జీ జిన్‌ పింగ్ సలహా ఇచ్చారు. 
xi xinping to his army కోసం చిత్ర ఫలితం
తైవాన్ అంశంపై జీ జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల అనంతరం ఉన్నత స్థాయి అధికారుల తో సమావేశం నిర్వహించడం విశేషం. తైవాన్ కూడా చైనా లో భాగమే, అది ఖచ్చితం గా మళ్లీ తమ దేశంలో కలిసి తీరుతుంది.  తైవాన్ ప్రజలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని తీరాల్సిందేనని లేని పక్షంలో సైనిక చర్యకు వెనకాడేది లేదంటూ గత బుధవారం జి జిన్‌ పింగ్ హెచ్చరించారు. "ఆసియా రీ-ఎష్యూరెన్స్ ఇనీషియేటివ్ చట్టం" ఆమోదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన నాలుగు రోజు ల్లోనే చైనా అధినేత ఇలాంటి హెచ్చరికలు చేయడం గమనార్హం.

xi jinping to his army కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: