రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని అప్పటికపుడు అంచనా కట్టడం కష్టం. కానీ కాసింత జాగరూకతతో ఆలొచన చెస్తే మాత్రం రాబోయే  పరిణామాలను కొంత గమనించవచ్చు. ఇక ఏపీలో రాజకీయం ఓ వైపు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంది. మరో వైపు వేగంగా పరిణామాలు మారుతున్నాయి.


ఎందుకంత ప్రతిష్ట :


జగన్ పై గత అక్టోబర్లో విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి కేసు ఇపుడు ఏపీ సర్కార్ ప్రతిష్టగా తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు   అప్పగించాలని హైకోర్టు చెప్పినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఎందుకో పట్టుదలకు పోతోంది. ఈ కేసు వివరాల ఫైళ్ల కోసం విశాఖ వచ్చిన  ఎన్ ఐ ఏ  అధికారులకు సిట్ అధికార్లు సహకరించడంలేదని న్యూస్ వైరల్ అవుతోంది. తమకు ఏపీ సర్కార్ నుంచి అనుమతి ఉంటేనే తప్ప తాము కేసు వివరాలు అందించలేమని పెర్కొన్నారు. దీంతో జగన్ కేసు విషయంలో దర్యాప్తు ఇపుడు అయోమయంలో పడింది.


కోర్టులో సవాల్ :


ప్రతిపక్ష నేత జగన్ కోడికత్తి కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు  సమీక్ష జరిపారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న.నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో సవాల్ చేయనుంది. కోడికత్తి కేసు హైకోర్టులో విచారణ జరుగుతుండగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. న్యాయపరంగా ఎలా వెళ్ళాలనే దానిపై చంద్రబాబు సమీక్ష జరిపారు. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమీక్షకు డీజీపీ ఠాకూర్, ఏజీ, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు.


అనుమానాలు :


ఈ కేసు విషయంలో ఇపుడు ఏపీ సర్కార్ ప్రతిష్టకు పోవడం ఎన్ఐఏకు అప్పగించకూడదని భావిస్తూండడంతో అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. నిజానికి మొదట్లో ఎవరూ ఈ కేసులో తెలుగుదేశం నేతల ప్రమేయం ఉంటుందని అనుకోలేదు. వైసెపీ నేతల ఆరోపణలను కూడా కేవలం రాజకీయంగానే చూస్తూ వచ్చారు. ఇపుడు ఎన్ఐఏకు అప్పగించకూడదన్నట్లుగా ప్రభుత్వం వైఖరి తీసుకోవడం, దీని మీద కోర్టులో సవాల్ కి వెళ్ళడాన్ని చూసిన తరువాత ఏదైనా తెర వెనక జరిగిందా అన్న సందేహాలు వస్తున్నాయి. నిజానికి ఎన్ఐఏకు ఇవ్వడం వల్ల టీడీపీకే లాభమన్న వాదనలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ కేసులో టీడీపీ కి ప్రమేయం లేకపోతే క్లీన్ చిట్ వస్తుంది. ఎన్నికల ముందు అది పార్టీకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఎందుకు ఇంతలా పట్టుదలకు పోతున్నారన్నది చూస్తే మాత్రం కొత్త అనుమానాలు పుట్టుకువస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: