ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెబుతున్నారు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న తీరుపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్నను ఎవరు ముంచారో క్లారిటీ ఇచ్చారు.


తన అన్నలా తాను దెబ్బ తిన కూడదనే చాలా వ్యూహాత్మకంగా పార్టీని తీసుకెళ్తున్నట్టు పవన్ చెబుతున్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పటి పరిస్థితులను ఆయన గుర్తు చేసుకున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పదీవీవ్యామోహంతో చాలామంది నాయకులు వచ్చి చేరారని.. వారే చిరంజీవిని ముంచేశారని పవన్ కామెంట్ చేశారు.


రాత్రికి రాత్రి ఎవరూ పెరగలేరని..ఓపిక పట్టలేని కొందరు నేతలు చిరంజీవి ప్రజారాజ్యాన్ని దెబ్బతీశారని పవన్ కామెంట్ చేశారు. ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారని పవన్ చెబుతున్నారు. అందుకే తాను జనసేన నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నానని పవన్ అంటున్నారు.


చిరంజీవి అన్నయ్యలా ఇబ్బందిపడకూడదనే తాను ఎక్కువగా కొత్త వారికి అవకాశం ఇవ్వదలచుకున్నానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. జనసేన వచ్చే ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ మరోసారి తేల్చిచెప్పారు. మరి పవన్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమేరకు ఫలిస్తాయో..!


మరింత సమాచారం తెలుసుకోండి: