దమ్మున్న ఛానల్, పత్రికగా తమను తాము వర్ణించుకునే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు సవాల్ విసిరారు. మీడియాకు ఇంగితం ఉండాలని కోరుకుంటున్న కేటీఆర్‌.. తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ ముక్క చెప్పగలరా ? అని ప్రశ్నించారు. ఇంతకూ ఈ సవాల్ ఎందుకు విసరాల్సి వచ్చింది. ఓ సారి చూద్దాం.

kcr scold chandrababu కోసం చిత్ర ఫలితం


ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌ పెట్టి మరీ ఏపీ సీఎం చంద్రబాబును డర్జీయస్ట్ పొలిటీషియన్ అని తిట్టిన విషయం తెలిసిందే. అంతే కాదు.. గతంలో మోడీ సంక ఎక్కావ్.. ఇప్పుడు రాహుల్ సంక ఎక్కావ్.. నీకు సిగ్గూ లజ్జా ఉందా.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ తన కాలమ్‌లో విమర్శలు గుప్పించారు.

KT Rama Rao


దీనికితోడు ఇటీవల కేటీఆర్‌.. మీడియా ఇంగిత జ్ఞానం వాడాలి అని సూచనలు చేశారు. నాయకులు ఎవరైనా తిట్టినా.. దాన్ని యథాతథంగా రాయకూడదన్న ఇంగితం పత్రికలకు ఉండాలన్నారు. దీనిపై రాధాకృష్ణ స్పందించారు. మీడియా సంగతి కాసేపు పక్కన పెడదాం.. మీ తండ్రి తిట్ల సంగతేంటి అని ప్రశ్నించారు.

ktr vs rk కోసం చిత్ర ఫలితం


గతవారం విలేకరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి వాడిన భాష, చేసిన హెచ్చరికలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయన్న రాధాకృష్ణ. కేసీఆర్ వాడిన భాష శ్రుతి మించిందన్నారు. మీడియాకు ఇంగితం ఉందా? లేదా? అని ప్రశ్నించే కేటీఆర్.. తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ ముక్క చెప్పగలరా? అని నిలదీశారువిలేకరుల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్న ఈ రోజుల్లో దేన్నీ దాచలేమని వివరణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: