ప్రధానిగా నరేంద్ర మోడీకి మంచి మార్కులే. కాని బిజెపి మాత్రం సొంత మెజార్టీతో అదికారం లోకి వచ్చే అవకాశం లేదని, కాంగ్రెస్ యేతర,బిజెపి యేతర పార్టీలు గణనీయంగా సీట్లు పొంద బోతున్నాయని తాజా సర్వే విడిపి అసోసియేట్స్ సంస్థ దేశ వ్యాప్త సర్వే నిర్వహించి వెల్లడించింది.


సర్వే ఫలితాలను శనివారం ట్విట్టర్‌ లో విడుదల చేస్తూ, లోక్‌ సభకు ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నాయకత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం 2014 లో మాదిరిగా సంపూర్ణ మెజారిటీ సాధించే అవకాశాలు లేవు అని తెలిపింది.  కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ పుంజుకోనున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన (272) సీట్లకు అందనంత దూరం ఉండిపోతుంది.


అయితే ఏ కూటమి లోనూ భాగస్వాములు కాని పార్టీలు సీదాగా 150 సీట్ల వరకు గెలవ నున్నాయి. ఎన్డీయే, ఇతరుల కన్నాఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించక పోవచ్చునని, ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలపై ఆధారపడక తప్పదని వీడీపీ అసోసియేట్స్ సంస్థ  తెలిపింది.


2014 లో సొంతంగా లోక్-సభలో మెజారిటీ స్థానాలు (282) గెలుచుకున్నా, ఈసారి 201 సీట్లను మాత్రమే గెలుచుకోనుంది. ప్రస్తుత లోక్-సభలో 44 మంది సభ్యులున్న కాంగ్రెస్ మరో 66 సీట్లను గెలుచుకోని 110 స్థానాలకి చేరొచ్చని అంచనావేసింది. ఎన్డీయే 225, యూపీఏ 167, ఇతరులు 150 స్థానాలు గెలుచుకుంటారని తెలిపింది.


ప్రధానిగా మోదీకి 40%, రాహుల్‌గాంధీకి 24% మంది మద్దతు తెలిపారు. మాయావతి, మమతా బెనర్జీ వంటి ఇతర నేతల వైపు రెండు శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. బీజేపీకి 32%, కాంగ్రెస్‌కు 24% మంది తమ మద్దతు ఇచ్చారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ బాగా పనిచేస్తున్నదన్న ప్రజలు, లోక్‌-సభకు మాత్రం బీజేపీకే మద్దతు ఇస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీయే 18, యూపీఏ 3, ఇతరులు 4 సీట్లు గెలుచుకోవచ్చని ఈ సర్వే తెలిపింది.


*రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్..

*గుజరాత్, మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ..

*పశ్చిమ బెంగాల్‌ లో తృణమూల్ మెజారిటీ సీట్లు …

*ఒడిశాలో వరుసగా నాలుగోసారి అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) ఆధిక్యత ప్రదర్శించ గలదన్నది. ఆ పార్టీకి 12, బీజేపీకి 9 సీట్లు వస్తాయని తెలిపింది.

*బీహార్‌లో ఎన్డీయేకు 32, యూపీఏకు 8 సీట్లు లభిస్తాయన్నది.

*యూపీలో ఎస్పీ,  బీఎస్పీ, ఆరెల్డీ లతో కూడిన మహాకూటమికి 40, బీజేపీకి 38, కాంగ్రెస్‌కు 2  స్థానాలు 

గెలుచుకోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.


బీజేపీ నాయకత్వంలోని ఎన్ డి ఏ కి అత్యధిక సంఖ్యలో సీట్లు లభించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే మాత్రం భాగస్వాములను ఎతుక్కోవలసిందే. ప్రధానిగా నరెంద్ర మోడీకే మొదటి స్థానం ఇస్తున్నరంటే బిజేపికి అది పెద్ద మైలేజీ కావచ్చు.

VDP Associates survey agency కోసం చిత్ర ఫలితం

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ దళపతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో తీపి కబురు దక్కింది. ఆయన కల సాకారం కానుందనే రీతిలో తాజాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకే విజయం కట్టబెడతారని వీడీపీ అసోసియేట్స్ తాజా సర్వే వెల్లడించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఏకపక్షంగా తీర్పునివ్వనున్నారని సర్వే స్పష్టంచేసింది.


తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా.. అందులో 16 స్థానాలను టీ ఆర్ ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపింది. మిగిలిన హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని ఎప్పటిలాగే ఎంఐఎం గెలుచుకుంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను అక్కున చేర్చుకోవడానికి అనేక కారణాలున్నాయని 57 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన కంటే నాలుగున్నరేళ్ళ సీఎం కేసీఆర్ పాలన మెరుగ్గా ఉన్నదని ప్రజలంతా భావిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: