మీరు అధికారంలోకి వస్తే.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ఆగుతుందని.. పరిమితం చేస్తారని.. లేకపోతే రాజధాని మారుస్తారని వాదనలు వినిపిస్తున్నాయి.. అలాంటి పరిస్థితి ఉందా.. మీరు అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారా.. దీనిపై ప్రజలు మీరు వివరణ ఇస్తారా.. అని టీవీ9 యాంకర్ రజినీకాంత్‌ జగన్‌ను ప్రశ్నించారు.


ఈ సమయంలో జగన్‌ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. మీరు ఇదే ప్రశ్న సీఎం చంద్రబాబును ఎందుకు అడగరు అని ప్రశ్నించారు. చంద్రబాబును ఇదే ప్రశ్న అడగొచ్చు కదా అని రజినీకాంత్‌ను రెట్టించి మరీ అడిగారు జగన్. చంద్రబాబు సీఎం అయి ఉండి కూడా అమరావతిలో ఇంకా ఇల్లు కట్టుకోలేదు.. మీరు ఈ ప్రశ్న ఎందుకు చంద్రబాబును అడగురు అని మళ్లీ ప్రశ్నించారు జగన్.


చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకోకపోగా... హైదరాబాద్‌లో బ్రహ్మాండంగా 100- 150 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లు గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అడుగుకు వేలకు వేల ఖర్చు పెడుతున్నారు. మరి మీరు ఎందుకు అడగరు అని ప్రశ్నించారు జగన్.


అదే అమరావతి ప్రాంతంలో తాను ఇల్లు కడుతున్నానని జగన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఆ ఇంట్లో చేరబోతున్నానన్నారు. అమరావతి ప్రాంతంలో పార్టీ ఆఫీస్ కడుతున్నామని చెప్పారు. తాము ఇన్ని చేస్తున్నా టీడీపీ నేతలు రకరకాలుగా తిమ్మిని బమ్మిని చేస్తారని జగన్ అన్నారు. అయితే ఇన్నిసార్లు జగన్ అడిగినా టీవీ9 యాంకర్‌ రజినీకాంత్‌ నుంచి మాత్రం సమాధానం రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: