తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రబాబు తన కుమారుడి భవిష్యత్ కోసం మాత్రమే పని చేస్తున్నారు తప్ప, ప్రజల కోసం మాత్రం కాదన్నారు. తన కుమారుడికి పదవులిచ్చి ఎదుగుదలకు ఉపయోగపడ్డారే కాని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. లోకేశ్ కోసం ఏపీ భవిష్యత్ నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
narendra modi criticized ap cm chandrababu కోసం చిత్ర ఫలితం

కుమారుడి భవిష్యత్తు కోసం సామాన్యుల పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతున్నారని ఆరోపించారు. భ్రష్ట విధానాలు, అవినీతితో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసి ముఖ్యమంత్రి  అన్నింటా విఫల మయ్యారని విమర్శించారు.  ఆదివారం డిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనంతపురం, కడప, కర్నూలు, నరసరావుపేట, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధి పోలింగ్‌ బూత్‌ స్థాయి కార్యకర్తలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. 
chandrababu love on his son కోసం చిత్ర ఫలితం
మొదట కార్యకర్తల అభిప్రాయాలు   తెలుసుకుని ప్రధాని స్పందించారు. ‘ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ప్రజలను మోసగించటం ఇది తొలిసారి కాదు. వారు ఎన్టీఆర్‌నే రెండు సార్లు మోసగించారు. అలాంటివారి నుంచి మోసానికి మించి ఏం ఆశించగలం? ఎన్టీఆర్‌ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను తుద ముట్టించే కార్ఫ్యక్రమాన్ని నాడే ప్రారంభించారు.  (కాంగ్రెస్‌ ముక్తభారత్‌) “నేషనల్‌ ఫ్రంట్‌” ఏర్పాటుచేస్తే, ఇప్పుడు ఆయన జామాత అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ ముందు తలొగ్గారు. తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌ను ఎప్పుడూ క్షమించలేదు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నవారు ప్రజలకు తీరని ద్రోహం తలపెడుతున్నారు’ అని విమర్శించారు. 
NTR had been backstabbed art కోసం చిత్ర ఫలితం
ఈ విధంగా ప్రధాని మోడీ ఎట్టకేలకు ఏపీపై దృష్టి సారించారు. ఏపీ సీఎం చంద్రబాబు పాలనను ఏకిపారేశారు. బిజేపి  బలోపేతం కోసం, రాబోయే ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. 


ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయించే (సన్ రైజ్) సంగతేమో గానీ, ఆయన ఇలాగే ఉంటే "ఏపి రాష్ట్రం అస్తమయం" అవడం ఖాయ మంటూ ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ. తనయుడి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టి, మిగతా ఎంతో మంది ప్రజల బిడ్డల్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అధికారంలో ఉన్నవాళ్లు, తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి తెలుగు వాళ్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 
NTR had been back staabbed కోసం చిత్ర ఫలితం
ఏపీలో కులరాజకీయాలు, అవినీతిని అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరన్నారు.  ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ ప్రశంసించారు నరేంద్ర మోదీ. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ ఎప్పుడూ క్షమించలేదన్నారు. కాని అదే కాంగ్రెస్‌తో ఇప్పుడు టీడీపీ కలిసిందని, మరణానంతరం కూడా ఎన్టీఆర్‌ను రెండోసారి వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విలువలను కాలరాసిన వారిని అధికారం నుంచి సాగనంపండి అని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 


కేంద్రంపై, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు ప్రధాని. ఎన్డీయే అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కాకినాడలో బీజేపీ మహిళ కార్యకర్త పై సీఎం చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. నేతలు ఎప్పుడైతే సహనం కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు దిగుతారో! అప్పుడే వారిలో ఓటమి భయం పట్టుకున్నట్లని ప్రధాని అభిప్రాయపడ్డారు.



చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని.. ఇప్పుడు ఏపీ ప్రజలకు పొడుస్తున్నారని మోడీ మండిపడ్డారు. అధికారం కోసం ఏపీ అభివృద్ధిని చంద్రబాబు తాకట్టు పెడుతున్నా రన్నారు. ఎన్టీఆర్ విలువలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి టీడీపీ ఎన్టీఆర్ వారసత్వాన్ని విలువలను త్యజించిందని పేర్కొన్నారు. 
సంబంధిత చిత్రం
ఏపీలో ఒక కుటుంబమే అధికారంలో ఉండడం ద్వారా తెలుగు వారి గౌరవం ఎలా నిలబడుతుందని చంద్రబాబు ఫ్యామిలీ పాలిట్రిక్స్ పై మోడీ నిప్పులు చెరిగారు. లోకేష్ ను రాజకీయాల్లోకి తెచ్చి ఏపీ ప్రజలను బాబు నిర్లక్ష్యం చేస్తూ వారి ఆశలను తుంగలో తొక్కాడని మండిపడ్డారు. పదే పదే మోడీని తిడుతూ తెలుగు వారి సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాబు విఫలమయ్యాడని.. 2019లో ప్రధాని పదవి నుంచి తనను దించేసేందుకు ఇతరులను నిలబెట్టేందుకు బాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: