జగన్ పాదయాత్ర ముగిసే సమయం దగ్గర పడుతుండటం తో టీడీపీ కి అనుకూలంగా చానెల్స్ కూడా జగన్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం. పాదయాత్ర అయిపోయి ఇన్నిరోజులు అవుతుంటే ఈ ఛానెల్స్ కు ఇప్పుడు గుర్తొచ్చాయని చెప్పాలి. ప్రధానంగా టీవీ 9 టీడీపీ పార్టీ కి సపోర్ట్ చేస్తుందని ముద్ర పడింది.  ఈ సంగతి అలా వుంచితే టీవీ9 సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్ వైకాపా అధ్యక్షుడు జగన్ ను ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వూలో జగన్ చాలా అద్భతంగా మాట్లాడారు. చాలా పకడ్బందీగా సమాధానాలు ఇచ్చారు. ఎక్కడా తడబాటు లేదు. ఎక్కడా తప్పించుకునే ఆలోచన లేదు.

Image result for jagan

ఎక్కడా పడికట్టు పదాలు వాడలేదు. ప్రతి ప్రశ్నకు చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారు. ఎక్కడా ఆవేశ పడిన దాఖలాలు లేవు. ఆలోచించి మాట్లాడానట్లు ఎక్కడా కనిపించలేదు. చెప్పిన ప్రతి పాయింట్, తన మనసులో ఎప్పటి నుంచో స్టోర్ లో వున్న రీతిలో చెపుతూ వచ్చారు. ఆ మధ్య మేధావి వర్గ రాజకీయ నాయకుడు ఉండవల్లి ఓ మాట అన్నారు. వాగ్దాటిలో వైఎస్ జగన్ వాళ్ల నాన్న రాజశేఖర్ రెడ్డి కన్నా మిన్న అన్నారు. మంచి వక్త అన్నారు. టీవీ9 చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయం మరోసారి స్పష్టమయింది. ఏ మాత్రం మొహమాట పడకుండా ఆ రెండు పత్రికలు, కొన్ని చానెళ్లు ఏ విధంగా చేస్తున్నాయని కుండ బద్దలు కొట్టారు.

Image result for jagan

హోదా, జీఎస్టీ, నోట్ల రద్దు మీద చాలా క్లియర్ గా మాట్లాడారు. అలాగే మోడీ, కేసిఆర్ బంధాలపై క్లియర్ గా చెప్పాల్సింది చెప్పారు. పొత్తుల మీద, పవన్ కళ్యాణ్ మీద తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్లు వివరించారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతిని తాను అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎక్స్ పోజ్ చేస్తామని, సాక్ష్యాధారాలు పకడ్బందీగా వుంటే కోర్టుకు తీసుకెళ్తానని క్లియర్ గా చెప్పేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: