ఏపీలో చివరి జిల్లా, అత్యంత వెనకబడిన ప్రాంతం, పాలకులనే నమ్ముకుని దశాబ్దాలుగా దగా పడుతున్న నేల, చైతన్యానికి, పౌరుషానికి మాత్రం  ఎక్కడా తీసిపోని  గడ్డ సిక్కోలు. అటువంటి ప్రాంతం కళ్ళురిమిందంటే రాజ‌కీయాలు, పార్టీలు భస్మీపటలమే. అరవై దశాబ్దంలో నక్సలైట్ ఉద్యమం పుట్టిన పోరుగడ్డ. ఈ జిల్లా తలచుకుంటే తరతరాలుగా రాజకీయం చేస్తున్న ఎంతటి వారైనా   వారెవరైనా తల్లకిందులు కాక తప్పదు. 


అక్కడ నుంచేనా :


గత నలభై రోజులుగా సిక్కోలుగా పాదయాత్ర చేసున్న జగన్ చారిత్రాత్మకమైన పాదయాత్రను సిక్కోలు జిల్లాకు అతి మూలన ఉన్న ఇచ్చాపురం వద్ద ముగించనున్నారు. మరో నలభై ఎనిమిది గంటల్లో ఆ హిస్టారికల్ ఈవెంట్ కి తెర లేవనుంది. ఇక ఆ మీటింగులో జగన్ ఏమి చెబుతారు, ఏ రకమైన సంచలనాలకు కేంద్ర బిందువు అవుతారన్నది ఇపుడు ఏపీవ్యాప్తంగా ఆసక్తికరమైన పరిణామంగా మారనుంది. జగన్ సభకు రెండు లక్షలకు పైగా జనం హాజరుకానున్నారు. పార్టీకి చెందిన 175 అసెంబ్లీ సీట్ల నుంచి ఇంచార్జులు, ఆశావహులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. జనవరి తొమ్మిది ఏపీని ఓ విధంగా హీటెక్కించనుకుంది.


అభ్యర్ధుల ప్రకటన :


ఇచ్చాపురం వేదికగా జగన్ పార్టీకి సంబంధించిన కీలక ప్రకటన చేస్తారన్న టాక్ ఇపుడు గట్టిగా వినిపిస్తంది. మొత్తం 175 సీట్లకు గానూ 60 శాతం అభ్యర్ధుల జాబితాను జగన్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ కంటే ముందే అభ్యర్ధులను అనౌన్స్ చేయడం ద్వారా ఏపీ రాజకీయాల్లో కాక పుట్టించాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటున్న టీడీపీపై పై చేయి సాధించాలని జగన్ భావిస్తున్నారు దాంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఎవరి పేర్లు జాబితాలో ఉంటాయి అన్న దానిపైన అభ్యర్ధులుగా భావిస్తున్న వారికి నూటొకటి కొడుతోంది.


అదీ వ్యూహం :


తాను చుట్టేసిన 13 జిల్లాల్లో పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసిన జగన్ వద్ద అన్ని రకాల సర్వేలు ఉన్నాయి. వాటిని క్రోడికరించుకుంటూ వివాదాలు లేని చోట, గెలుపు అవకాశాలు ఖాయం అన్న చోట, సిట్టింగు ఎమ్మెల్యేలు ఉన్న చోట అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని వైసీపీ వర్గాల సమాచారం. దీనివల్ల పెద్దగా అసమ్మతి తలెత్తదని, ఒకవేళ ఎవరైనా నిరసన గళం వింపించినా సర్దుబాటు చేసేందుకు కూడా వెసులుబాటు ఉంటుందన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తానికి జనవరి 9న ఇచ్చాపురంలో అనేక సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: