ఈ మద్య కొంత మంది చేస్తున్న నిరసనలు చూస్తుంటే..ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంటుంది.  ప్రభుత్వం తమకు వ్యతిరేఖ నిర్ణయాలు తీసుకున్నా.. ప్రభుత్వం పనితీరు బాగా లేకున్నా నిరసనలు వెల్లువెత్తుతుంటాయి.  తాజాగా భారత దేశ వ్యాప్తంగా   ట్రిపుల్ తలాక్ చర్చలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లుపై విజయవాడలో ముస్లింలు వినూత్నంగా నిరసన తెలిపారు. 
Image result for triple talaq bill
ఇది ఒక మతానికి సంబంధించిన సాంప్రదాయం అని..అనాధిగా వస్తున్న ఈ సాంప్రదాయం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు తమ సంప్రదాయాన్ని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.   ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ.. ఆయన భార్య జశోదాబెన్ మాస్క్‌లు ధరించిన ఇద్దరికి పెళ్లి చేశారు.
Image result for triple talaq bill
ఈ పెళ్లికి ముస్లింలు పెళ్లి పెద్దలుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజానికి 1968లో మోదీ-జశోదాబెన్‌ల వివాహం జరిగింది. ప్రస్తుతం జశోదా బెన్ ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: