మీడియా డొల్లతానాన్ని హాస్యనటుడు ఆలీ బయటపెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా, సెలబ్రిటీలతో మాట్లాడకుండానే వారిగురించి ఊహాగానాలతో వార్తలు వండి వార్చే మీడియా, సోషల్ మీడియాకు నిజాంగా ఆలీ గట్టిగానే వాతలు పెట్టారు. కొద్ది రోజులుగా ఆలీ వైసిపిలో చేరుతున్నట్లు బాగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని విజయవాడలో ఆలి ప్రస్తావిస్తూ తాను వైసిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జగన్ తో కలిసి ఫొటో దిగితే వైసిపిలో చేరుతున్నట్లేనా ? అంటూ ఎదరు ప్రశ్నించారు. నిజానికి ఆలీ ప్రశ్నకు మీడియా, సోషల్ మీడియా దగ్గర ఎటువంటి సమాధానం లేదు.

 

ఓ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు తాను విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చినపుడు అక్కడ జగన్ కూడా కనిపించినట్లు చెప్పారు. కాబట్టి ఇద్దరం కలసి ఒకే విమానంలో ప్రయాణం చేశామన్నారు. అక్కడ ఎవరో తాము మాట్లాడుకుంటున్నపుడు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారని అన్నారు. ఆ ఫొటోలను పట్టుకుని మీడియా, సోషల్ మీడియా వైరల్ చేసేసి తాను వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం చేసేసిందన్నారు. తనను సంప్రదించకుండానే వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం  చేసిన మీడియాదే తప్పన్నారు. నిజానికి ఆలీ చెప్పిందాంట్లో తప్పేమీలేదు. ప్రస్తుతం మీడియ అలాగే పనిచేస్తోంది. అయితే, నేతలు, సెలబ్రిటీలు కూడా తాము నిజంగానే పార్టీ మారాలనుకున్నా, చేరాలనుకున్నా చివరి నిముషం వరకూ గోప్యంగానే ఉంచుతున్న విషయం చూస్తునే ఉన్నాం.

 

ఎప్పుడైతు జగన్, ఆలీ ఫొటోలతో పాటు వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం మొదలుకాగానే టిడిపి, జనసేనలో కలకలం మొదలైందన్నది వాస్తవం. ఎందుకంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆలీ బాగా సన్నిహితుడన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంత సన్నిహితుడైన ఆలీ జనసేనలో కాకుండా వైసిపిలో చేరటమేంటనే ప్రశ్న కూడా మొదలైంది. అదే సమయంలో ఆలీ మొదటి నుండి టిడిపి సానుభూతిపరుడు. పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున రాజమండ్రిలో పోటీ చేయటానికి ప్రయత్నం కూడా చేశారు. చేస్తే గీస్తే టిడిపి నుండో లేకపోతే జనసేన నుండి పోటీ చేయాలి కానీ వైసిపిలో చేరటమేంటనే ప్రశ్న చాలామందిలో కలిగింది. చివరకు ఆలీ క్లారిటీతో జరిగిన ప్రచారమంతా అబద్ధమేనని తేలిపోయింది. మొత్తానికి ఆలీ మీడియా, సోషల్ మీడియా గాలి తీసేశారన్నది వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: