ఒకప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందంటే..నెల రోజుల ముందు నుంచే సందడి వాతావరణం నెలకొనేది.  గ్రామాల్లో సంక్రాంతి వెడుకలు అంబరాన్నంటేవి.. కోడి పందాలు, ఎడ్ల పందాలు, రంగు రంగు ముగ్గులో..అందులో గొబ్బెమ్మలు, హరిదాలు, గంగిరెద్దులు ఇలా ఊరంతా పచ్చ పచ్చగా కనిపించేది.  సంక్రాంతి పండుగ అనగానే ఎంతో సంతోషం, పాడిపంటలతో కళకళలాడేటువంటి పల్లెలు, గాలిపటాల ఎగురవేతలు, గంగిరెద్దుల నృత్యాలు, సుఖసంతోషాలతో జీవనం సాగేది. ఇదంతా ఒకప్పటి సంగతి.

Image result for సంక్రాంతి సంబరాలు

ఇప్పుడు పండుగ ప్రజలకు భారంగా మారింది.  నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో ఏమి కొనలేని పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి, నూతన దుస్తులు ధరించి రంగురంగుల ముగ్గులు వేస్తు కనిపించే దృశ్యాలు కనుమరుగవుతున్నాయి. పట్టణాల్లో ఉండేవారు సైతం సంక్రాంతి పండుగ వచ్చిందనగానే పల్లెలకు చేరుకొని కలిసికట్టుగా పండుగ సంబరాల్లో పాలుపంచుకునేవారు. కాగా పల్లెలు కరువుతో అల్లాడిపోతుండగా అనేక మంది బతుకు దెరువుకోసం దుబాయివంటి దేశాలకు వలసవెళ్లారు.

సంక్రాంతి సంబరాలేమాయే!

దీంతో తమ వారు లేరని, రాలేని పరిస్థితి ఉండడంతో పండుగలు నామమాత్రంగానే జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే బాలసంతులు, పకీరుల వేశాల దృశ్యాలు ఏనాడో కనుమరుగయ్యాయి. ఇంటిమందుకు వచ్చి వంగివంగి దండం పెట్టే గంగిరెద్దుల నృత్యాల జాడతెలియకుండా పోయింది. పేదతరగతి ప్రజల పరిస్థితి దయనీయ ఉండగా మద్యతరగతి ప్రజలు నిత్యవసర వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు వంటగ్యాస్ వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే వంటగ్యాస్ మద్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది.

Related image

పండుగపూట పట్టణాలనుండి పల్లెలకు వెళ్దామంటే ప్రయాణ చార్జీలు పెరుగడంతో ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిలో సంక్రాతి సంబరాలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. ప్రచార సాధనాల్లో ప్రచారం చేసినట్లుగా సంబరాలు అంతగా లేవు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నిండేవారిది నిండుతుంది, ఎండేవారిది ఎండుతుంది. ఇటువంటి పరిస్థితిలో నిండేవారు పండుగలు చేసుకుంటున్నారు. ఎండేవారు పండుగలకు దూరంగా ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: