వినటానికి ఇది నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జనాల నాడి ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయమై ఇండియా టివి, సిఎన్ఎక్స్ దేశవ్యాప్తంగా సర్వే చేసింది. సరే ఆ సర్వేలో ఏ పార్టీ సంగతి ఎలాగున్నా ఏపి విషయం వరకూ సర్వే లెక్కలపై చర్చ మొదలైంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 ఎంపి సీట్లు గెలుచుకుంటుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక గతంలో కొన్ని మీడిమా సంస్ధల సర్వేలో చెప్పినట్లుగానే వైసిపినే మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని తేల్చేసింది. సర్వేలో వివరాల ప్రకారమైతే వైసిపి 18 లోక్ సభల్లో జెండాను ఎగరవేస్తుందట. మిగిలిన ఆరు సీట్లలో టిడిపి నాలుగు సీట్లు, కాంగ్రెస్ 2 నియోజకవర్గాల్లో గెలుస్తుందని సర్వే అంచనా.

 

వైసిపి 19 సీట్లు గెలుస్తుందని చెప్పినా, టిడిపి నాలుగు సీట్లలో విజయం సాధిస్తుందని చెప్పినా ఎవరికీ ఆశ్చర్యం లేదు. కానీ కాంగ్రెస్ రెండు నియోజకవర్గాల్లో గెలుస్తుందని చెప్పటాన్నే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేశారు. అప్పటికీ ఇఫ్పటికీ పార్టీ పరిస్ధితిలో పెద్దగా తేడా ఏమీ కనిపించటం లేదు. 2014లో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతల్లో చాలామంది వైసిపిలోకి టిడిపిలోకి చేరిపోయారు. అంటే అప్పటికన్నా ఇప్పటికి మరింత దిగజారిపోయిందనే చెప్పాలి. అయితే, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఇద్దరు ముగ్గురు తిరిగి పార్టీలో చేరినా వారి వల్ల కాంగ్రెస్ కు వచ్చే ఉపయోగమేంటో అందరికీ తెలిసిందే.

 

కాకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశమేదైనా ఉందంటే అది తెలుగుదేశంపార్టీతో పొత్తు ఒక్కటే. టిడిపి ఓట్లు ఏమైనా కాంగ్రెస్ కు పడితే డిపాజిట్లు దక్కుతాయన్నది అంచనా. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు చాలా చోట్ల కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. సరిగ్గా టిడిపి ఓట్లు కాంగ్రెస్ కు ట్రాన్సఫర్ అయితే చెప్పుకోతగ్గ స్ధాయిలో ఓట్లు వస్తాయనే అనుకుంటున్నారు. కానీ తాజా సర్వే మాత్రం కాంగ్రెస్ కు రెండు ఎంపి సీట్లు వస్తాయని చెప్పటమే విడ్డూరంగా ఉంది. బహుశా ఆ రెండింటిలో కూడా ఒకటి కర్నూలు సీటేమో ? మరి రెండో సీటు ఏ కాకినాడో లేకపోతే అరకో అయ్యుంటుందని కాంగ్రెస్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: