హాస్యనటులు అలీ.. రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఇప్పటికే టీడీపీ పార్టీలో నామమాత్రంగా ఉన్న అలీ.. అటు వైసీపీ అధినేత జగన్‌ను, ఇటు పవన్ కల్యాణ్‌ను, టీడీపీ అధినేత చంద్రబాబును కొద్ది సమయంలోనే భేటీ కావడం కలకలం సృష్టించింది.

COMEDIAN ALI WITH JAGAN కోసం చిత్ర ఫలితం


అయితే ఏ పార్టీలో చేరాలన్న అంశంపై అలీ మాత్రం చాలా క్లియర్‌ గా ఉన్నాడు. తనకు ఏ పార్టీలో చేరాలన్న అంశంపై అలీ పెడుతున్న కండిషన్స్ వెరైటీగా ఉన్నాయి. తనకు గుంటూరు 1 నుంచి కానీ గుంటూరు 2 నుంచి కానీ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా టిక్కెట్‌ ఇవ్వాలట. కేవలం టిక్కెట్ ఇవ్వడమే కాదు.. పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాలట.

COMEDIAN ALI WITH CHANDRABABU కోసం చిత్ర ఫలితం


ఇదీ అలీ కండిషన్.. ఈ డిమాండ్స్‌కు ఎవరు తలఒగ్గితే ఆ పార్టీలోనే చేరతానని తెగేసి చెబుతున్నారు అలీ. పార్టీ టిక్కెట్ వరకూ ఓకే కానీ.. మంత్రి పదవి ఇస్తానంటేనే పార్టీలో చేరతా అంటూ కండిషన్‌ పెట్టడం మాత్రం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌ అవుతోంది. ఇందుకు ఏ పార్టీ ఒప్పుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.

COMEDIAN ALI WITH CHANDRABABU కోసం చిత్ర ఫలితం


తన డిమాండ్‌ వినిపించేందుకు.. వాటి గురించి భరోసా తీసుకునేందుకే అలీ ముగ్గురు పార్టీ నేతలనూ కలుస్తున్నారని భావించవచ్చు. అలీ ముస్లిం సామాజిక వర్గానికి చెందడంతో ఆ కోటాలో తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీలో తప్పకుండా చేరతానంటున్నాడు. అంతే కాదు.. ఈ రెండు కండిషన్లకు ఎవరు ముందు ఓకే చెబితే వారితోనే చేరతానని మరీ చెబుతున్నాడు. పార్టీలో చేరేముందే ఇన్ని కండిషన్లు పెడితే ముందు ముందు ఇంకెన్ని షరతులు ఉంటాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: